Sridevi Shoban Babu Telugu Movie Review: శ్రీదేవి శోభన్ బాబు తెలుగు మూవీ రివ్యూ

Sridevi Shoban Babu Telugu Review: సంతోష్ శోభన్ మంచి నటుడే అయినప్పటికీ స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం లో తప్పు చేస్తున్నదనిపిస్తుంది ఎందుకంటే తన గత చిత్రాలన్నీ కూడా పరాజయం అవుతున్నయి ఇక తన చివరి చిత్రం కళ్యాణం కమనీయం కూడా ప్లాప్ అయింది. ఇక మల్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి శ్రీదేవి శోభన్ బాబు అనే కామెడీ చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ తెల్సుకుందాం.

Sridevi Shoban Babu Telugu Movie Review

శ్రీదేవి శోభన్ బాబు కథ

శోభన్(సంతోష్ శోభన్ ) ఊర్లో కాళిగా తిరుగుతూ ఉంటాడు, శ్రీదేవి (గౌరీ జి కిషన్) సిటీ లో పెరిగి శోభన్ ఉంటున్న ఉరికి ఒక పని మీద వస్తుంది అయితే శ్రీదేవి శోభన్ ఉంటున్న ఇంటిని సొంతం చేసుకోడానికి వచ్చింది అని తెల్సుస్తుంది. చివరికి శ్రీదేవి ఎవరు? అసలు శోభన్ ఇల్లుని ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంది అనేది మిరు చిత్రం చూసి తెల్సు కోవాలి.

శ్రీదేవి శోభన్ బాబు మూవీ నటీనటులు

సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్, రోహిణి, మహబూబ్ బాషా, నాగబాబు తదితరులు. ఈ చిత్రానికి దర్శకత్వం ప్రశాంత్ కుమార్ దిమ్మల, ఛాయాగ్రహణం సిద్దార్థ్ రామస్వామి, సంగీతం కమ్రాన్, ఎడిటింగ్ శశిధర్ రెడ్డి, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుశ్రీదేవి శోభన్ బాబు
దర్శకుడుప్రశాంత్ కుమార్ దిమ్మల
నటీనటులుసంతోష్ శోభన్, గౌరీ జి కిషన్, రోహిణి, మహబూబ్ బాషా, నాగబాబు తదితరులు
నిర్మాతలువిష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల
సంగీతంకమ్రాన్
సినిమాటోగ్రఫీసిద్దార్థ్ రామస్వామి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

 శ్రీదేవి శోభన్ బాబు  సినిమా ఎలా ఉందంటే?

సినిమా కథ ఎలా ఉన్న కామెడీ ఉంటె చిత్రం హిట్ అవుతుంది అనేధీ అందరికి తెలిసిన విషయం, సరిగ్గా శ్రీదేవి శోభన్ బాబు కూడా ఇదే కోవలోకి వస్తుంది, మొడటి సగంలో హీరో హీరోయిన్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఉన్నప్పటికీ చిత్రం ఏ మాత్రం ఎంగేజ్ చేయదు అయితే మహబూబ్ బాషా చేసిన కామెడీ కొంత ఊరటనిస్తోంది.

ఇక తరువాయి భాగం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది, సాగదీసిన సన్నివేశాలు, అంటి అంటనటువంటి ఎమోషన్ లతో బోర్ అయ్యేలా చేస్తుంది, సంతోష్ శోభన్ కొంతమేర సినిమానే కాపాడే ప్రయత్నం చేసాడు.

సంతోష్ శోభన్ నటనకి పేరు పెట్టడానికి లేదు, ఒక పల్లెటూరి కుర్రాడిగా బాగా చేసాడు, గౌరీ జి కిషన్ పర్వాలేదన్పిస్తుంది, ఇక మిగిలిన తారాగణం ఉన్నంతలో బాగానే చేసారు.

ప్రశాంత్ కుమార్ దిమ్మల ఒక రొటీన్ కథతో మన ముందుకొచ్చి అక్కడక్కడా నవ్వించిన, మొత్తం మీద ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాడు. ఇక టెక్నికల్ గా చిత్రం పర్వాలేదు, సిద్దార్థ్ రామస్వామి ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగుంది, కమ్రాన్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం పర్వాలేదనిపించారు ఇక మిగిలిన సాంకేతిక నిపుణులు తమ వంతు బాగా చేసారు.

చివరగా, శ్రీదేవి శోభన్ బాబు ఒక రెగ్యులర్ కామెడీ డ్రామా

ప్లస్ పాయింట్లు:

  • సంతోష్ శోభన్
  •  కామెడీ

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ కథ
  •  ఎమోషన్ లేకపోవడం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు