Jailer Telugu Movie Review: జైలర్ మూవీ రివ్యూ

Jailer Review: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఒకప్పుడు తమిళ ప్రేక్షకులకే కాదు, యావత్ భారత దేశం అంత పెద్ద పండగ. అయితే రోబో తరువత సినిమాలు వచ్చిన అన్ని పరాజయం పాలయ్యాయి. రజినీకాంత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కానీ, ప్రేక్షకుల అభిరుచి ఇపుడు చాల మారిపోయింది, రజినికాంత్ అయినా, చిరంజీవి అయినా, ఎంత పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా, ప్రేక్షకులకి సినిమా నచ్చకపోతే నిర్ధాక్షిన్యంగా ప్లాప్ చేస్తున్నారు. ఇక రజినీకాంత్ గత చిత్రాలు పెద్దన్న, పేట, దర్బారు, రోబో 2.౦ ఇలా వరుస పరాజయాలు చవిచూడటంతో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని జైలర్ అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఇక ట్రైలర్ అయితే అంచనాలని పెంచేలా ఉన్నప్పటికీ, ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Jailer Review

కథ

ముథువెల్ పాండియన్ (రజినీకాంత్ ) ఒక స్ట్రిక్ట్ జైలర్, అయితే తన కాపాలలో ఒక కరడుగట్టిన హంతకుడు ఉంటాడు. ఇక ఆ హంతకుడు డ్రగ్ మాఫియా కి లీడర్, అయితే ఆ లీడర్ ని ఎలాగైనా బైటికి తీసుకురావాలని, పలు గ్యాంగ్ లు ప్లాన్స్ వేస్తుంటాయి. కానీ అక్కడ ముథువెల్ పాండియన్ ఉండడంతో ఏమి చేయలేకపోతారు. ఇక ఎలాగైనా ఆ ముథువెల్ అడ్డు తొలగించాలని తనని, తన కుటుంబాన్ని చంపాలని ప్రయత్నిస్తుంటారు, ఇక ఈ ప్రయత్నం లో ముథువెల్ పాండియన్ అసలు ఎవరు అనేది తెలియడంతో అందరు కంగు తింటారు. అసలు ముథువెల్ పాండియన్ ఎవరు అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

జైలర్ మూవీ నటీనటులు

రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు మరియు తదితరులు. ఇక ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చగా, ఆర్. నిర్మల్ ఎడిటింగ్ చేయగా, ఈ చిత్రాన్ని కాలనీతి మారన్ నిర్మించారు.

సినిమా పేరుజైలర్
దర్శకుడునెల్సన్ దిలీప్ కుమార్
నటీనటులురజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు మరియు తదితరులు.
నిర్మాతలుకాలనీతి మారన్
సంగీతంఅనిరుద్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీవిజయ్ కార్తీక్ కన్నన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

జైలర్ సినిమా ఎలా ఉందంటే?

హీరో ఒక ఊర్లో కుటుంబంతో అన్ని మర్చిపోయి మాములు జీవితం గడపటం, తరువాత అతనికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండటం. ఇలాంటి టెంప్లేట్ తో కొన్ని వందల సినిమాలే వచ్చాయి, దీనికి బీజం వేసింది రజినీకాంత్ భాష సినిమా. అందరు రజినీకాంత్ సినిమాని ఫాలో అయ్యి సినిమాలు తీశారు, ఇప్పుడు రజినీకాంతే తన సినిమాని ఫాలో అయ్యి ఈ జైలర్ ని తిసారనిపిస్తుంది.

ఈ చిత్రం రజినీకాంత్ అభిమానులని ఉర్రుతలూగించే ఘట్టం తో ప్రారంభం అవుతుంది, కానీ ఆ తరువాత ఒక మాములు సినిమా అయిపోతుంది. ఇదంతా ట్రేలర్ లో చూస్తేనే అర్థమైపోతుంది. అయితే మొదటి భాగంలో కథ అంతెం లేకపోయినా, రజిని కాంత్, అతని కుటుంబం తో ముడి పడి ఉన్న సన్నివేశాలు మరియు సునీల్, మోహన్ లాల్ ఇలా చాల పెద్ద నటులు కనిపించడంతో కొంత మేర పర్వాలేదన్పిస్తుంది.

ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మల్లి సీట్ లో నుంచి లేసేలా చేస్తుంది. ఇక రెండవ భాగం ఫ్లాష్ బ్యాక్, పతాకసన్నివేశాలు, రజిని కాంత్ మార్క్ మేనరిజం, ఇలా అన్ని కలబోసి రెండవ భాగాన్ని చాల బాగా తీర్చిదిద్దాడు. కథ మామూలుగానే ఉన్నప్పటికీ, రజిని కాంత్ స్టయిల్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేలా ఉంటుంది.

ఇక 70 సంవత్సరాల వయసులో కుడా ఇంత ఎనేర్జిటిక్ గా వర్క్ చేస్తున్నందుకు రజినీకాంత్ గారిని అభినందించాల్సిందే. ఇక నెల్సన్ అన్ని సినిమాల్లో హీరోలు చాల సైలెంట్ గా ఉంటారు, అందుకు రజినీకాంత్ కూడా మినహాయింపు ఎం లేదు. చాల వరకు సైలెంట్ గా ఉన్నప్పటికీ, తన మార్క్ స్టైల్ తో అలరించాడు. ఇక నరసింహ తరువాత రమ్యకృష్ణ రజినీకాంత్ తో కలసి నటించిందని, ఇక ఉన్నంతలో చాల బాగా చేసింది, రజినీకాంత్ కొడుకు గ వసంత్ రవి పర్వాలేదు, ఇక సునీల్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, తదితరులు తమ పాత్రలు మేరకు బాగా చేసారు.

డాక్టర్ తో మంచి విజయం సాధించిన నెల్సన్, బీస్ట్ తో పరాజయాన్ని చవిచూసాడు. ఇక ఇప్పుడు జైలర్ తో కొంత విజయం సాధించాడని అనిపిస్తుంది. మంచి కథతో మన ముందుకొచ్చాడని చెప్పలేంగాని, నెల్సన్ మార్క్ బ్లాక్ కామెడీ, రజినీకాంత్ మార్క్ స్టైల్ ని మిక్స్ చేసి బాగా తీసాడు.

సాంకేతికంగా, జైలర్ బాగుంది, అనిరుద్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం తో ప్రతి సన్నీవేషాన్ని ఇంకో మెట్టుకి తీసుకెళ్లాడు. ఇక విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం కూడా చాల బాగుంది.

చివరగా, జైలర్ స్లో గా ఉన్నప్పటికీ ఉర్రుతలూగించే చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • రజినీకాంత్
  • కథనం
  •  నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • సింపుల్ కథ

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు