Sapta Sagaralu Dhaati – Side A Movie Review: సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ మూవీ రివ్యూ

Sapta Sagaralu Dhaati – Side A Movie Review Review: కన్నడ ఇండస్ట్రీ లో ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలే కాదు, కంటెంట్ బేస్డ్ చిత్రాలు కూడా వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన కాంతారా, 777 చార్లీ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ఇక రక్షిత్ శెట్టి, మంచి నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా మనందరికీ తెలిసిందే, అయితే తను, ఎప్పుడూ కథకే ప్రాధాన్యం ఇస్తాడు అనేది మరోసారి సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ చిత్రంతో నిరూపించాడు. ఈ చిత్రం కన్నడలో మంచి టాక్ తెచ్చుకుంది, ఇక ఇప్పుడు తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అనే టైటిల్ తో ఈరోజు విడుదలైంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో తెలుసుకుందాం.

Sapta Sagaralu Dhaati Side A Movie Review

కథ

మను (రక్షిత్ శెట్టి) క్యాబ్ డ్రైవర్గా పని చేస్తూ ఉంటాడు, ప్రియ (రుక్మిణి వసంత్) సింగర్ కావాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటారు. అయితే ప్రియకి సముద్రం పక్కన ఇల్లు కొనుక్కుని, మనుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఆశ. కానీ మధ్యతరగతి నేపధ్యం అవ్వడంతో, ఇటు మను దగ్గరగాని, ప్రియ దగ్గర గాని డబ్బులు ఉండవు. ఇంతలోనే మను యజమాని కొడుకు కారుతో ఆక్సిడెంట్ చేయగా ఒకరు చనిపోతారు, ఇక ఆ యజమాని కేసు తన పైన వేసుకుని జైలుకి వెళ్తే చాల డబ్బు ఇస్తా మరియు తొందర్లోనే బెయిల్తో నిన్ను విడిపిస్తా అని మను కి చెప్తాడు. ప్రియా కలని నిజం చేయొచ్చు అని, నేరం తన పైన వేసుకుని జైలు కి వెళతాడు. కానీ మను యజమాని హఠాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో బెయిల్ రాక మను జైలు లోనే ఉండి పోతాడు. చివరగా, ప్రియ, మనుని విడిపించడానికి చాల ప్రయత్నాలే చేస్తుంది, మరి మను జైలు నుంచి బైటకి వచ్చాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ మూవీ నటీనటులు

రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జె ఆచార్, అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే తదితరులు. హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరణ్ రాజ్ సంగీతం సమకూర్చాడు. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం చేయగా, సునీల్ భరద్వాజ్, హేమంత్ ఎం రావు ఎడిటింగ్ చేసారు. ఇక ఈ చిత్రాన్ని రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేసారు.

సినిమా పేరుసప్త సాగరాలు దాటి – సైడ్ ఏ
దర్శకుడుహేమంత్ ఎం రావు
నటీనటులురక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జె ఆచార్, అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, తదితరులు
నిర్మాతలురక్షిత్ శెట్టి
సంగీతంచరణ్ రాజ్
సినిమాటోగ్రఫీఅద్వైత గురుమూర్తి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ సినిమా ఎలా ఉందంటే?

100 సంవత్సరాల సినీ చరిత్రలో కొన్ని వేల ప్రేమ కథలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు, ఎందుకంటే ప్రేమకథలు ఒక్కటే అయినా వాటి నేపధ్యాలు కొన్ని కోట్లు. ఒక్కో ప్రేమ కథకి ఒక్కో నేపధ్యం ఉంటుంది, కథ చాల మాములుగా ఉన్న కూడా ఆ కథని ఏ నేపధ్యంలో చెప్తున్నాం అనేది చాల ముఖ్యం. ఇక ఈ సప్త సాగరాలు దాటి సైడ్ ఏ చాల మాములు ప్రేమ కథే, కానీ నేపధ్యం చాల కొత్తగా ఉండడంతో, సినిమా స్లో గా ఉన్న కూడా, మనల్ని కథతో ప్రయాణించేలా చేస్తుంది.

సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి చాల సమయం పడుతుంది, పాత్రల పరిచయానికి దర్శకుడు చాల టైం తీసుకున్నాడు, ప్రేక్షకులని మను మరియు ప్రియ ప్రపంచాల్లోకి తీసుకెళ్లడానికి ఇంత సమయం తీసుకున్నాడనిపిస్తుంది. అయితే ఒక్కసారి పాత్రలతో కనెక్ట్ అయ్యాక, ఒక పొయెటిక్ వేలో, మంచి డైలాగ్స్ తో, మంచి సన్నివేశాలతో, మంచి సంగీతంతో, మంచి విజువల్సతో ఎంగేజింగ్ గా సాగిపోతుంది.

ఇక రెండవ భాగం, చాలావరకు జైలు నేపథ్యంలోనే సాగుతూ, చివరికి వచ్చేసరికి ఒక భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తుంది. సినిమా మొదటి నుంచి కూడా స్లో గానే అనిపిస్తుంది, అయితే అదే టెంపో రెండవ భాగంలో కూడా ఉంటుంది, కానీ సినిమా హాల్ నుంచి బైటికి వచ్చాక, సినీమా మన మైండ్లో నుంచి అంత ఈజీగా వెళ్లిపోదు. కన్నడ సినిమానే అయినా, తెలుగు డబ్బింగ్ చాలా బాగా ఉంది.

ఇక రక్షిత్ శెట్టి, మను పాత్రలో అదరగొట్టేసాడు, ఒక ప్రేమికుడిగా కనిపిస్తూనే, జైల్లో తను పడే వేదనని తన హావ భావాలతో అద్భుతంగా చూపించాడు. ఇక ప్రియ పాత్రలో రుక్మిణి వసంత్ సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం తన కళ్ళతోనే నటించింది అనిపిస్తుంది. ఇక మిగితా నటి నటులు అచ్యుత కుమార్, అవినాష్, తదితరులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

మొదటిగా దర్శకుడు హేమంత్ ఎం రావుని మనం అభినందించాలి, ఎందుకంటే, ఇలాంటి కథతో, కన్నడలో ఒక స్టార్ స్టేటస్ ఉన్న హీరోని ఒప్పించి, ఆ తరువాత ప్రేక్షకులని కూడా మెప్పించడం అంత ఈజీ కాదు. ప్రేమ కథే అయినా, ఎక్కడ కమర్షియల్ అంశాలని ఇరికించకుండా, అనవసరమైన కామెడీని పెట్టకుండా, ఒక సింపుల్ ప్రేమ కథని హృదయానికి హత్తుకునేలా తీసి, ప్రేక్షకులని మెప్పించడంలో విజయం సాధించాడు.

సాంకేతికంగా, సప్త సాగరాలు దాటి సైడ్ ఏ ఉన్నతంగా ఉంటుంది, చరణ్ రాజ్ సంగీతం గాని, అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం గాని అద్భుతంగా ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే విల్లు తెర వెనక హీరోలు అని చెప్పొచ్చు.

చివరగా, సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సింపుల్ ప్రేమ కథ కానీ హృదయానికి హత్తుకుంటుంది.

ప్లస్ పాయింట్లు:

  • పాత్రలు
  • కథనం
  • సంగీతం
  • ఛాయాగ్రహణం
  • ఎమోషన్

మైనస్ పాయింట్లు:

  • స్లో నరేషన్

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు