Bhagavanth Kesari Movie Review: భగవంత్ కేసరి మూవీ రివ్యూ

Bhagavanth Kesari Movie Review Review: బాలక్రిష్ణ అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి C / O , అది సినిమాలో అయినా, బయట అయినా. ఇంతకముందు బాలక్రిష్ణ సినిమాలు హిట్ అయ్యేవి గాని, బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా హిట్ అవ్వకపోయేవి, కానీ అఖండ చిత్రం తో పూర్తిగా మారిపోయింది. అఖండ, వీర సింహారెడ్డి తో 100 కోట్ల మార్క్ ని అవలీలగా దాటేశాడు మన బాలయ్య. అయితే బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగేసరికి, తన తదుపరి చిత్రం భగవంత్ కేసరి, భారీ బడ్జెట్ తో విడుదల చేసారు. కామెడీ సినిమాలతో పేరు సంపాదించినా అనిల్ రావిపూడి మరియు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబు కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో అని సినిమా అనౌన్స్ అయినప్పట్నుంచి ఆసక్తి నెలకొంది. ఇక ట్రైలర్ తో అంచనాలని పెంచేసి, టైగర్ నాగేశ్వర్ రావు, లియో తో పోటీపడుతు ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో చూద్దాం.

Bhagavanth Kesari Movie Review

కథ

భగవంత్ కేసరి (బాలక్రిష్ణ) తన అన్నయ్య కూతురు అయిన విజ్జి (శ్రీలీల) ని చిన్నప్పట్నుంచి అల్లారుముద్దుగా పెంచుతాడు. అయితే విజ్జి ని ఆర్మీ ఆఫీసర్ చేయాలనేది తన అన్నయ్య కోరిక, దీంతో విజ్జిని ఎలాగైనా ఆర్మీ ఆఫీసర్ చేయాలి అని, భగవంత్ కేసరి విజ్జి ని రాత్రి పగలు ట్రైన్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక సమయంలో విజ్జి ఇదంతా టార్చర్ లా భావిస్తుంది, ఆర్మీ ఆఫీసర్ అవ్వను నన్ను వదిలేయ్ అని చెప్పి ఊరు విడిచి వెళ్లి పోతుంది. కానీ భగవంత్ కేసరి ఏది ఏమైనా విజ్జి ని ఆర్మీ ఆఫీసర్ చేయాలని నిర్ణయించుకుని, తనని వెతకడానికి బయలుదేరుతాడు. అయితే విజ్జి అనుకోకుండా ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. చివరికి భగవంత్ కేసరి విజ్జి ని ఎలా కాపాడాడు? అసలు ఆ సమస్య ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

భగవంత్ కేసరి మూవీ నటీనటులు

బాలక్రిష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సి. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం అందించగా, థమన్ సంగీతం సమకూర్చారు. తమ్మి రాజు ఎడిటర్, సాహు గరపతి మరియు హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పైన నిర్మించారు.

సినిమా పేరుభగవంత్ కేసరి
దర్శకుడుఅనిల్ రావిపూడి
నటీనటులుబాలక్రిష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు
నిర్మాతలుసాహు గరపతి మరియు హరీష్ పెద్ది
సంగీతంథమన్
సినిమాటోగ్రఫీసి. రామ్ ప్రసాద్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

భగవంత్ కేసరి సినిమా ఎలా ఉందంటే?

బాలయ్య సినిమా అంటే మాస్, కళ్ళు చెదిరే పతాక సన్నివేశాలు, తన మార్క్ డైలాగులు అంతే సినిమా హిట్. ఇదే ఫార్ములాతో అఖండ, వీర సింహ రెడ్డి లాంటి హిట్స్ కొట్టాడు. ఇక భగవంత్ కేసరి కూడా అదే కోవలోకి వస్తుంది.

కథ ఏ మాత్రం కొత్తగా అనిపించదు, పైగా ఆర్మీ ట్రైనింగ్ అంత ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాని గుర్తు చేస్తుంది. ఈ సినిమాలో కొత్తగా ఏదైనా ఉంది అంటే, అది బాలయ్య లుక్ మరియు తెలంగాణ స్లాంగ్. సినిమా చాల మాములుగా మొదలవుతుంది, అయితే ఒక్కసారి బాలయ్య ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక, సినిమా ఊపందుకుంటుంది.

ఇక మొదటి సగం, ఎక్కడ కూడా అనిల్ రావిపూడి మార్క్ డైలాగులు లేకుండా ఇంటెన్స్ గా వెళ్తుంది కానీ పూర్తిగా ఎంగేజింగ్ అయితే అనిపించదు. ఇక రెండవ భాగం అయితే యాక్షన్ సన్నివేశాలు తప్ప, సినిమా సహనాన్ని పరీక్షిస్తుంది. బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. ఏది ఏమైనప్పటికి భగవంత్ కేసరి, బాలయ్య ఫాన్స్ ని మాత్రం అలరిస్తుంది.

ఇక 60 వయసులో కూడా బాలయ్య ఎనేర్జి చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇక ఈ సినిమాని కూడా తన భుజాల మీద మోశాడు. తన వయసుకి తగ్గ పాత్ర అవడంతో, ప్రతి సన్నివేశం లో అవలీల గా నటించాడు. చాల గ్యాప్ తరువాత కాజల్ అగర్వాల్, తెలుగు తెర పైన కనిపించింది, అయితే తన పాత్రకి కొంత స్కోప్ ఉన్నప్పటికీ, కాజల్ హావా భావాలూ, తన మేకప్ వల్ల, ఎక్కడ కూడా తాను నటించింది అని అనిపించదు. ఇక శ్రీలీల ఉన్నంతలో బాగా చేసింది, మిగితా నటి నటులు వారి పాత్రల మేరకు బాగానే చేసారు.

అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ అనేది ప్రధాన ఎలిమెంట్, కానీ బాలయ్య తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా తీయాలి అనుకోవడం అభినందించాల్సిన విషయం. అయితే కథ మాములుగా ఉంది కానీ కథనం మీద కొంచెం ద్రుష్టి పెట్టాల్సింది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి కొంతమేరకు ప్రేక్షకులని మెప్పించడంలో విజయం సాధించాడు.

సాంకేతికంగా, భగవంత్ కేసరి బాగుంది, థమన్ పాటలు అంతగా లేవు కానీ, సినిమాని కాపాడింది మాత్రం తన నేపధ్య సంగీతం. ఇక సి. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం కూడా బాగుంది.

చివరికి, భగవంత్ కేసరి కొంతమేరకు ఎంగేజ్ చేస్తుంది.

ప్లస్ పాయింట్లు:

  • బాలక్రిష్ణ
  • నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • కథనం

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు