Tiger Nageswara Rao Movie Review: టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ

Tiger Nageswara Rao Movie Review Review: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్న మాస్ మహారాజ రవితేజ, మునుపెన్నడూ లేని విధంగా అన్ని భాషల్లో, ముఖ్యంగా హిందీ లో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే సినిమా ట్రైలర్ అంచనాలని పెంచడం, ఒక ఎత్తయితే, రవితేజ ముంబై లో హింది లో మాట్లాడ్డం అదికూడా చాల అవలీల గా మాట్లాడడంతో,ప్రేక్షకుల అట్టెన్షన్ ని గ్రాబ్ చేసాడు మన రవితేజ. ఇక ఎట్టకేలకి ఈ సినిమా ఈరోజు విడుదలయింది, మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Tiger Nageswara Rao Movie Review

కథ

1980 లో స్టువర్ట్ పురం నాగేశ్వరరావు (రవితేజ ) అనే దొంగ, పోలీసులకి చెప్పి మరి దొంగతనాలు చేసేవాడు. అక్కడి లోకల్ గుండాలు మరియు భూస్వాములు రైల్వే స్టేషన్లని, భూములని, దౌర్జ్యన్యంగా లాకుంటున్న సమయంలో, స్టువర్ట్ పురం ప్రజలకి అండగా నిలుస్తాడు . దీంతో నాగేశ్వర రావు, అక్కడి ప్రజలకి హీరో అయిపోయాడు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పోలీసులకి చెప్పి దొంగతనాలు చేస్తున్న కూడా పోలీసులు తనని పట్టుకోకపోవడం తో, స్టువర్ట్ పురంకి కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఒక సమయంలో నాగేశ్వర రావు పోలీసులకి పట్టు పడతాడు, అయితే చాల సంవత్సరాల జైలు జీవితం తరువాత, నాగేశ్వర రావు ఇంకా పెద్ద దొంగగా మారి పోలీసులకి నిద్ర లేకుండా చేస్తాడు. అయితే స్టువర్ట్ పురం నాగేశ్వర రావు గా ఉన్న తాను టైగర్ నాగేశ్వర రావు గా ఎలా మారాడు అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

టైగర్ నాగేశ్వర రావు మూవీ నటీనటులు

రవితేజ, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్, నూపుర్ సనన్, రేణు దేశాయ్, నాసర్, మురళీశర్మ, జిషుసేన్‌గుప్తా, తదితరులు నటించారు. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు, జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు, మది ఛాయాగ్రహణం, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.

సినిమా పేరుటైగర్ నాగేశ్వర రావు
దర్శకుడువంశీ
నటీనటులురవితేజ, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్, నూపుర్ సనన్, రేణు దేశాయ్, నాసర్, మురళీశర్మ, జిషుసేన్‌గుప్తా, తదితరులు.
నిర్మాతలుఅభిషేక్ అగర్వాల్
సంగీతంజి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీమది
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

టైగర్ నాగేశ్వర రావు సినిమా ఎలా ఉందంటే?

మనం పీరియడ్ సినిమాలు, బయోపిక్స్ చాలానే చూసాం, కానీ పీరియడ్ సినిమా అందులో ఒక దొంగ బయోపిక్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. 1980 టైములో టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ పోలీసులకి చుక్కలు చూపించాడు. అయితే ఒక దొంగ క్యారెక్టర్ ని, తన జీవితంలో జరిగిన ఘట్టాలని ఇన్స్పిరేషన్గా తీసుకుని, కమెర్షియల్ ఫార్మాట్లో బ్లెండ్ చేయడానికి చాల గట్స్ కావాలి.

సినిమా చాల ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది, దింతో కథలోకి వెంటనే వెళ్లిపోతాం, అయితే కథ ఇంటరెస్టింగ్ గా ఉంది, కథనం ఎంగేజింగ్ గా వెళ్తుంది, సినిమా మూడ్, కలర్ టోన్, అన్ని సీట్ కి అతుక్కుపోయేలా చేసాయి. కానీ సినిమాకి అతి పెద్ద మైనస్ రన్ టైం, సినిమా ఎంత బాగున్నా మూడు గంటలు కూర్చోవడం అనేది కష్టం.

ఇక మొదటి సగం లవ్ ట్రాక్ తప్పిస్తే, ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక రెండవ భాగం కూడా ఇంట్రెస్టింగ్ గానే వెళ్తుంది, కానీ మధ్యలో స్లో అయిపోతుంది, మళ్ళి ప్రీ క్లైమాక్స్ లో వేగం అందుకుంటుంది. ఏది ఏమైనా, రవితేజ ఫాన్స్ కే కాదు, సినీ ప్రేమికులకు రవితేజ ని ఈ క్యారెక్టర్ లో చూడటం అనేది కన్నుల పండుగ.

రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు, ఎలాంటి పాత్ర అయిన సరే అవలీల చేసేస్తాడు. అయితే రవితేజని సీరియస్ పాత్రల్లో చూడడం అరుదు, అయితే ఈ నాగేశ్వరరావు పాత్రలో చాల షేడ్స్ ఉన్నాయి ఒక్క కామెడి తప్ప. రవితేజ మేకప్ కొన్ని సన్నివేశాల్లో పేలవంగా ఉంటుంది. ఇక నుపుర్ సనన్, పాత్ర నిడివి కొంచెమే కానీ ఉన్నంతలో పర్వాలేదు, గాయత్రి భరద్వాజ్ పాత్ర కి మంచి స్కోప్ ఉంది, మరియు తాను కూడా ఆ పాత్రకి న్యాయం చేసింది. ఇక అనుపమ్ ఖేర్ డబ్బింగ్ అంత ఇంప్రెసివ్ గా అనిపించదు కానీ తన నటనతో మెప్పించాడు. ఇక రేణుదేశాయ్, నాసర్, మురళీశర్మ, జిషుసేన్‌గుప్తా వారి పాత్రలకి న్యాయం చేసారు.

ఇంత పెద్ద సినిమాని హేండిల్ చేయాలి అంటే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు కావాలి, కానీ తక్కువ అనుభవం ఉన్న వంశీ, ఈ చిత్రాన్ని చాల బాగా హేండిల్ చేసాడు. కమర్షియల్ గా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ, ప్రేక్షకులని మెప్పించడం అనేది పెద్ద టాస్క్. ఇక ఆ విషయంలో విజయం సాధించాడు.

సాంకేతికంగా, టైగర్ నాగేశ్వర రావు బాగుంది, కానీ కొన్ని సన్నివేశాల్లో వి. ఎఫ్. ఎక్స్ పేలవంగా ఉంది ఈ సినిమాకి మేజర్ హైలెట్ ఏంటంటే మది ఛాయాగ్రహణం, లొకేషన్స్ దగ్గర్నుంచి, కలర్ టోన్, మూడ్ సినిమాని మరో మెట్టుకి తీసుకెళ్లాయి. ఇక జి. వి. ప్రకాష్ కుమార్ రెండు పాటలు పర్వాలేదు, నేపధ్య సంగీతం కూడా బాగుంది కానీ ఇంకా బాగుండాల్సింది.

చివరగా, టైగర్ నాగేశ్వర్ రావు అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పిస్తుంది.

ప్లస్ పాయింట్లు:

  • కథ
  • కథనం
  • కలర్ టోన్

మైనస్ పాయింట్లు:

  • రన్ టైం
  • కొన్ని  వి. ఎఫ్. ఎక్స్ షాట్స్

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు