Captain Miller Movie Telugu Review: కెప్టెన్ మిల్లర్ మూవీ తెలుగు రివ్యూ

Captain Miller Movie Review Review: ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం, సంక్రాంతికి తెలుగులో కూడా విడుదల కావాల్సింది, కానీ ఆ టైం కి తెలుగులోనే గుంటూరు కారం, హను మాన్, సైంధవ్, నా సామి రంగ ఉండడంతో, థియేటర్స్ సర్దుబాటు అవ్వలేదు. ఇక ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది, ధనుష్ హీరోగా నటించడం, రియలిస్టిక్ చిత్రాలు తీసే అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వం చేయడం, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార కీ రోల్ ప్లే చేయడం, సందీప్ కిషన్ గెస్ట్ రోల్ చేయడం, ఇలా అన్ని కలిసి సినిమా మీద అంచనాలని పెంచాయి. ఇక ఆలస్యం చేయకుండ ఈ చిత్రం ఎలా ఉంది ఈ వీడియో లో తెల్సుకుందాం.

Captain Miller Movie Telugu Review

కథ

బ్రిటీష్ హయాంలో తమిళనాడులోని ఒక గ్రామంలో ఈసా (ధనుష్) నివసిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో ఈసా పూర్వికులు కట్టించిన గుడి ఉంటుంది, కానీ అక్కడి రాజు, తక్కువ కులం వారిని ఆ గుడిలోకి అనుమతించడు. అంటరానితనాన్ని, అక్కడ జరిగే అణచివేతని, ఈసా భరించలేకపోతాడు. ఈసా అన్న సెంగోలన్ బ్రిటిష్ కి వ్యతిరేకంగా శాంతియుత పోరాటం చేస్తుంటాడు. మర్యాద దొరుకుతుందని ఈసా బ్రిటిష్ ఆర్మీ లో చేరతాడు, ఒకరోజు బ్రిటిష్కి ఎదురు తిరిగిన భారతీయులందరిని చెంపేయమని ఆర్డర్ వస్తుంది. ఇష్టం లేకున్నా ఈసా ఆ పని ని పూర్తి చేస్తాడు. తరువాత ఆ చంపిన వాళ్లలో తన అన్న కుడా ఉన్నాడని తెలియడంతో భరించలేక బ్రిటిష్ అధికారిని చంపేస్తాడు. అక్కడినుంచి పారిపోయి కన్నయ్య గ్యాంగ్ లో చేరి కెప్టెన్ మిల్లర్ గా మారతాడు. ఈసా ఎలా కెప్టెన్ మిల్లర్ గా ఎదిగాడు, బ్రిటిష్ వారిని ఎలా ఎదిరించాడు అనేది మిగతా కథ.

 కెప్టెన్ మిల్లర్ మూవీ నటీనటులు

ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్, కెమెరా సిద్ధార్థ నుని, ఎడిటర్ నాగూరన్, సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరు కెప్టెన్ మిల్లర్
దర్శకుడుఅరుణ్ మాథేశ్వరన్
నటీనటులుధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్ కుమార్ తదితరులు
నిర్మాతలుసెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
సంగీతంజి.వి.ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీసిద్ధార్థ నుని
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

 కెప్టెన్ మిల్లర్ సినిమా ఎలా ఉందంటే?

కుల వివక్ష, అంటరాని తనం పైన తమిళంలో చాల సినిమాలే వచ్చాయి. పా. రంజిత్, వెట్రిమారన్ మరియు మారి సెల్వరాజ్ సినిమాలు చాలావరకు ఈ పాయింట్స్ పైనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో అరుణ్ మతీశ్వరన్ కూడా, కుల వివక్ష, అంటరాని తనానికి దేశ భక్తి ని, యాక్షన్ ని జోడించి ఈ కెప్టెన్ మిల్లర్ ని తీశారు.

సినిమా మొత్తం మనకి ఇంగ్లీష్ సినిమా మాడ్ మాక్స్ గుర్తొస్తుంది. సినిమా మొదలైనప్పట్నుంచి, యాక్షన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కుల వివక్ష, దేశభక్తి అనే ఎమోషన్ ఉన్న కూడా, ఆ ఎమోషన్ సినిమా అంత ఫీల్ అవ్వలేమ్. మొదటి భాగం అక్కడక్కడా కొంచెం కథనం నెమ్మదించిన, ఇంటర్వెల్ దగ్గ్గర వచ్చే సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.

ఇక రెండవ భాగం, ఫాస్ట్ కథనంతూ, వెళ్తూ ఉంటుంది. రెండవ భాగంలో డ్రామా తగ్గించి, మొత్తం యాక్షన్ పైనే ద్రుష్టి పెట్టాడు దర్శకుడు అరుణ్ మతీశ్వరన్. మొత్తం మీద చాల వరకు డ్రాబాక్స్ ఉన్నప్పటికీ ఈ చిత్రం మంచి సినిమాటిక్ ఎక్సపీరియన్సుని ఇస్తుంది.

ఇక నటన విషయానికి వస్తే, ధనుష్ గురించి ఎంత చెప్పిన తక్కువే, ఏ సినిమాలో అయినా తను పోషించిన పాత్రకి న్యాయం చేస్తాడు. తను పోషించిన పాత్రని తను తప్ప ఇంకెవరు పోషించలేరు అనే విధంగా చేస్తాడు. ఈ కెప్టెన్ మిల్లర్లో కూడా, రెండు విభిన్నమైన పాత్రలని పోషించి, తన నటనతో మెప్పించాడు. ఇక ప్రియాంక అరుళ్ మోహన్, పాత్ర బాగున్నా, తను ఈ పాత్రకి సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. శివరాజ్ కుమార్ పోషించిన పాత్ర నిడివి తక్కువే అయినా, తన నటనతో ఆ పాత్రకి ప్రాణం పోసాడు. తెలుగు నటుడు సందీప్ కిషన్ కూడా బాగా చేసాడు, ఇక మిగతా నటి నటులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

అరుణ్ మతీశ్వరన్ మళ్ళి తనకి తెలిసిన యాక్షన్ నే ఈసారి డోస్ ఎక్కువ పెంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. యాక్షన్ అంత బాగున్నా కథ మీద ఇంకా ద్రుష్టి పెట్టాల్సింది.

ఇక ఈ కెప్టెన్ మిల్లర్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది, ఛాయాగ్రహణం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ, జి.వి. ప్రకాష్ కుమార్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం బాగుంది. ఇక మిగతా టెక్నికల్ టీం కూడా బాగా చేసారు.

చివరగా, కెప్టెన్ మిల్లర్ యాక్షన్ లవర్స్ కి మాత్రమే

ప్లస్ పాయింట్లు:

  • నటన
  • ఛాయాగ్రహణం
  • నేపధ్య సంగీతం
  • యాక్షన్

మైనస్ పాయింట్లు:

  • సింపుల్ కథ

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు