Ooru Peru Bhairavakona Movie Review: ఊరు పేరు భైరవకోన మూవీ రివ్యూ

Ooru Peru Bhairavakona Movie Review Review: సందీప్ కిషన్, కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తున్నాడు గాని, హిట్ మాత్రం పడట్లేదు. వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు, కానీ హిట్ పడట్లేదు. తను చివరగా నటించిన, మైకేల్, గల్లీ రౌడీ ప్లాప్ అవ్వడంతో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఊరు పేరు భైరవకోన చిత్రంతో మన ముందుకొచ్చాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలాగా కనిపించిన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.

Ooru Peru Bhairavakona Movie Review

కథ

బసవ (సందీప్ కిషన్) ఒక దొంగ ఆ పని నచ్చక వదిలేసి సినిమాలో స్టంట్ మాన్ గా సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఒకరోజు భూమి(వర్ష బొల్లమ్మ) అనే అమ్మాయిని కలుస్తాడు. ఆ తరువాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో భైరవ కోన అనే గ్రామంలో అడుగుపెడతాడు. ఆ ఊర్లో అందరు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు బసవ భైరవకోన కి ఎందుకు వెళ్ళాడు, ఆ ఉరినుంచో తిరిగి బైటపడ్డాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

ఊరు పేరు భైరవకోన మూవీ నటీనటులు

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, హర్ష చెముడు, వెన్నెల కిషోర్, తదితరులు నటించిన ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర మరియు ఛాయాగ్రహణం రాజ్ తోట.

సినిమా పేరుఊరు పేరు భైరవకోన
దర్శకుడువిఐ ఆనంద్
నటీనటులుసందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, హర్ష చెముడు, వెన్నెల కిషోర్, తదితరులు
నిర్మాతలురాజేష్ దండా
సంగీతంశేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీరాజ్ తోట
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ఊరు పేరు భైరవకోన సినిమా ఎలా ఉందంటే?

సినిమా మొదలయ్యాక, కొంచెం విరుపాక్షలాగా ఉందేంటి అనే సందేహం వస్తుంది. కానీ పది నిమిషాల తరువాత, ఎప్పుడు చూడని సన్నివేశాలతో కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. మొదటి సగం మంచి కామెడీ, సస్పెన్స్ ఎలెమెంట్స్ తో ఎంగేజ్ చేస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశంతో రెండవ భాగం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది.

కానీ మొదటి సగం కంటే, రెండవ సగం ఇంకా బాగుంటుందేమో అనిపించేలా చేసిన ఇంటర్వెల్ సన్నివేశం. రెండవ భాగం మొదలయ్యాక, కథలో సరైన థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ లేక బోరింగ్ అనిపిస్తుంది. అక్కడక్కడా పరవల్దన్పించిన, రెండవ సగం ఇంకా బాగా రాయాల్సింది. ఏదిఏమైనా ఊరు పేరు భైరవకోన ఎంగేజ్ చేసే చిత్రం.

ఇక నటన విషయానికి వస్తే, బసవగా సందీప్ కిషన్ పర్వాలేదు, కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం అవ్వడంతో నటనకి అంతగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక వర్ష బొల్లమ్మ పర్వాలేదు. కావ్య థాపర్ పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం లేదు. వైవా హర్ష ఉన్నంతలో బాగా కామెడీ పండించాడు. వెన్నెల కిషోర్ మల్లి తన కామెడీతో సినిమా మొత్తమ్ నవ్వించాడు. మిగిలిన నటి నటులు వారి పాత్రల మేరకు బాగానే చేసారు.

వి ఐ. ఆనంద్ కమర్షియల్ అంశాలను ఉంచుతూనే కొత్త కథలని తెర పైన ప్రెసెంట్ చేస్తున్నాడు. కానీ చాలావరకు పరాజయాలనే ఎక్కువగా చూసాడు. అయితే ఈసారి మల్లి కొత్త కథతో వచ్చి ప్రేక్షకులని ఎంగేజ్ చేసాడు.

సాంకేతికంగా, ఊరు పేరు భైరవకోన బాగుంది, రాజ్ తోట ఛాయాగ్రహణం సినిమాకి ప్రధాన ఆకర్షణ. శేఖర్ చంద్ర పాటలు బాగున్నాయి మరియు నేపధ్య సంగీతం మొదటి సగంలో బాగుంది కానీ రెండవ సగంలో అంతగా లేదు.

చివరగా, ఊరు పేరు భైరవకోన అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే ఫాంటసీ థ్రిలర్ చిత్రం

ప్లస్ పాయింట్లు:

  •  కామెడి సన్నివేశాలు
  • అక్కడక్కడా థ్రిల్లింగ్ సన్నివేశాలు
  • అక్కడక్కడా సస్పెన్స్ ఎలెమెంట్స్

మైనస్ పాయింట్లు:

  • సెకండ్ హాఫ్

సినిమా రేటింగ్: 3.5 /5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

తాజా వార్తలు