Bramayugam Movie Review Telugu: భ్రమయుగం మూవీ రివ్యూ

Bramayugam Movie Review Telugu:మళయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి తన వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ వస్తున్నాడు. క్రిస్టోఫర్ వంటి కమర్షియల్ సినిమా, కన్నూర్ స్క్వాడ్ లాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, నాన్పాకాల నేరతు మయక్కం లాంటి కామెడీ డ్రామా, ఇలా అన్ని రకాల సినిమాలు చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇప్పుడు మళ్ళి అందరిని ఆశ్చర్య పరుస్తూ భ్రమయుగం అనే హారర్ సినిమాతో వచ్చాడు. ఈ చిత్రం మళయాళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులో ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.

Bramayugam Movie Review Telugu

కథ

తేవన్ (అర్జున్ అశోకన్) ఒక సింగర్, తక్కువ కులం వాడవ్వడంతో బానిస జీవితం గడుపుతూ ఉంటాడు. ఇక ఆ జీవితం ఇష్టంలేక, ఒకరోజు అక్కడి నుంచి తప్పించుకుని ఒక మాన్షన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తేవన్ పాట నచ్చిన కొడుమన్ పొట్టి (మమ్మూట్టి) తనకి ఆశ్రయం ఇస్తాడు. అయితే కొడుమన్ తో పాటు తనకి వంట మనిషిగా ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్తాడు. తేవన్ కి మెల్లిగా ఆ మాన్షన్ లో ఏదో జరుగుతుంది, కొడుమన్ పొట్టి కూడా వింతగా కనిపిస్తుండంతో భయం స్టార్ట్ అవుతుంది. మరి తేవన్ ఎలాంటి సమస్యని ఎదుర్కున్నాడు, ఆ మాన్షన్ కథేంటి అనేది సినిమా చూసి తెల్సుకోవాలి.

భ్రమయుగం మూవీ నటీనటులు

మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ మరియు ఇతరులు. ఈ చిత్రానికి దర్శకత్వం: రాహుల్ సదాశివన్, సంగీతం: క్రిస్టో జేవియర్, ఛాయాగ్రహణం: షెహనాద్ జలాల్, ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ, ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు YNOT స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర మరియు ఎస్. శశికాంత్ నిర్మించారు.

సినిమా పేరుభ్రమయుగం
దర్శకుడురాహుల్ సదాశివన్
నటీనటులుమమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, ఇతరులు
నిర్మాతలుచక్రవర్తి రామచంద్ర మరియు ఎస్. శశికాంత్
సంగీతంక్రిస్టో జేవియర్
సినిమాటోగ్రఫీషెహనాద్ జలాల్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

భ్రమయుగం సినిమా ఎలా ఉందంటే?

భ్రమయుగం అనేది మనం రెగ్యులర్ గా చూసే సినిమా కాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం మమ్ముట్టి క్యారెక్టరైజేషన్‌ని మిస్టరీ గా చూపించడం మరియు మిస్టరీ ఎలిమెంట్‌ని దాచి ఉంచడంతో ఏదో జరుగుతుంది అని ఆసక్తి కలుగుతుంది. ఇక మొదటి భాగం స్లో గా ఉన్నప్పటికీ ఎంగేజ్ చేస్తుంది. కానీ రెండవ భాగం చాల స్లో గా ఉండడంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

కానీ, కొన్ని సన్నివేశాలు మాత్రం ఒళ్ళు గగుర్పుడిచేలా తీశారు. బ్లాక్ అండ్ వైట్ లో ప్రతి సన్నివేశం మనల్ని స్క్రీన్ కి అతుక్కుపోయేలా చేస్తుంది. చూసే ప్రేక్షకుడికి మూడ్ క్రియేట్ అవుతుంది కానీ, స్లో కథనం బోర్ కొట్టిస్తుంది. ఒకవేళ స్లో కథలు నచ్చని వాళ్ళు ఉంటె ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్. ఇక ఈ చిత్రం మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది మరియు కథ ఎక్కువగా ఒక భవనంలో జరుగుతుంది. కాబట్టి, ఇలాంటి సినిమాకు పెర్‌ఫార్మెన్స్‌, టెక్నికల్‌ అంశాలు అద్భుతంగా ఉండాలి. ఈ విషయంలో భ్రమయుగం కి వంక పెట్టడానికి లేదు.

కొడుమన్ పొట్టి గా మమ్మూట్టి అద్భుతంగా చేసాడు. ఇలాంటి పాత్రలో మమ్మూట్టి ని తప్ప ఇంకెవరిని ఉహించుకోలేం. ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో మెప్పించాడు, ముఖ్యంగా ఒక ఈవిల్ నవ్వుతో అయితే ప్రేక్షకులని భయపెట్టాడు. ఇక తేవన్ గా అర్జున్ అశోకన్ కుడా అద్భుతంగా చేసాడు. ప్రతి సన్నివేశంలో పాత్ర కనిస్పిస్తుంది తప్ప, వారు కనిపించరు. ఇక సిద్ధార్థ్ భరతన్ ఉన్నంతలో బాగానే చేసారు. మిగిలిన నటి నటులు తమ పాత్రల మేరకు బాగా చేసారు.

దర్శకుడు రాహుల్ సదాశివన్ మాములు కథనే ఎంచుకున్న, దాన్ని తెరపై చాల బాగా ప్రెసెంట్ చేసాడు. కాకపోతే రెండవ భాగం పైన ఇంకొంచెం వర్క్ చేయాల్సింది. ఓవరాల్ గా రాహుల్ సదాశివన్ ప్రేక్షకులని మెప్పించాడు.

సాంకేతికంగా, భ్రమయుగం అద్భుతంగా ఉంటుంది. షెహనాద్ జలాల్ ఛాయాగ్రహణం ఈ సినిమాకి ప్రధాన వెన్నెముక. క్రిస్టో జేవియర్ పాటలు తెలుగులో అంతగా లేవు కానీ తన నేపధ్య సంగీతంతో చాల సన్నివేశాలకి ప్రాణం పోసాడు. టెక్నికల్ కేటగిరీలో ఈ చిత్రానికి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చివరగా, భ్రమయుగం స్లో గా ఉన్నప్పటికీ మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి మాత్రం కాదు.

ప్లస్ పాయింట్లు:

  • మమ్మూటీ నటన
  • అర్జున్ అశోకన్ నటన
  • ఛాయాగ్రహణం
  • నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్లు:

  • స్లో కథనం

సినిమా రేటింగ్: 2.75 /5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు