Gaami Movie Review: గామి మూవీ రివ్యూ

Gaami Movie Review: మాస్ సినిమాలకి మరియు విభిన్నమైన చిత్రాలకు పేరుగాంచిన విశ్వక్ సేన్, ఈసారి ఒక కొత్త ప్రయోగాత్మకమైన సినిమాతో మన ముందుకొచ్చాడు. ఈ గామి అనే సినిమా విశ్వక్ సేన్ ఈ నాగరానికేమైంది సినిమా తరువాత ఒప్పుకున్నా సినిమా. ఇక చాల కారణాల వల్ల దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది ఈ సినిమా పూర్తి చేయడానికి. ఇక తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన విజువల్స్ ని సాధించడంతో అందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. ఇక ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలో విడుదలైంది ఇక ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Gaami Movie Review

కథ

శంకర్(విశ్వక్ సేన్ ) ఒక అఘోర, తన ఎవరో, ఎక్కడినుంచి వచ్చాడో తనకి గుర్తు రాక సతమతమవుతుంటాడు. దీనికి తోడు శంకర్ కి ఒక వింత జబ్బు ఉంటుంది అది మనిషి స్పర్శ తగిలితే మూర్ఛపోయి పడిపోవడం. ఈ వింత జబ్బుతో చాల బాధని అనుభవిస్తున్న సమయంలో, తన ఉంటున్న ఆశ్రమం లో మిగతా అఘోరాలు, తనని ఆశ్రమం వదిలి వెళ్ళమని సూచిస్తారు. ఇక తన జబ్బుకి మందు హిమాలయాల్లో ఉందని తెలుసుకున్న శంకర్, హిమాలయాలకు ప్రయాణం సాగిస్తాడు. దారిలో మైకాలజిస్ట్ అయినా జాహ్నవి (చాందిని చౌదరి) పరిచయం అవుతుంది. చివరికి శంకర్ తన గమ్యాన్ని చేరుకోడానికి ఎలాంటి సవాళ్ళని ఎదుర్కున్నాడు? జాహ్నవి తనకి ఎలా సహాయపడింది? మరో పక్క దేవదాసి అయిన దుర్గ (అభినయ) కథ మరియు CT-౩౩౩ అనే కథ ఎలా శంకర్ కథకి లింక్ అయి ఉన్నాయనేది మీరు సినిమా చూసి తెల్సుకోవాలి.

గామి మూవీ నటీనటులు

విశ్వక్సేన్, చాందిని చౌదరి, ఎమ్ జి అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడాడ, రమ్య పసుపులేటి, శాంతిరావు, మయాంక్ పరాఖ్, జాన్ కొట్టోలి, బొమ్మ శ్రీధర్, రజనీష్ శర్మ, కెఆర్ ఉన్నికృష్ణ, బి వెంకట్ రమణరావు, తదితరులు. గామి చిత్రానికి విద్యాధర్ కగిత రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీష్ మరియు ప్రేక్షకులు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: నరేష్‌ కుమారన్‌, సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్‌ రెడ్డి.

సినిమా పేరుగామి
దర్శకుడువిద్యాధర్ కగిత
నటీనటులువిశ్వక్సేన్, చాందిని చౌదరి, ఎమ్ జి అభినయ, తదితరులు
నిర్మాతలుకార్తీక్ శబరీష్ మరియు ప్రేక్షకులు
సంగీతంనరేష్‌ కుమారన్‌
సినిమాటోగ్రఫీవిశ్వనాథ్‌ రెడ్డి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

గామి సినిమా ఎలా ఉందంటే?

తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా, యువ దర్శకులు విభిన్నమైన కాన్సెప్ట్‌ లతో వస్తున్నారు. అందులో ఈ గామి తీసిన విద్యాధర్ ఒకరు. గామి మనం రెగ్యులర్గా చూసే సినెమాలకి పూర్తి విరుద్దంగా ఉంటుంది. కథ ఎలా ఉంది అని పక్కన పెడితే, మూడ్, విజువల్స్ సినిమాకి అతుక్కుపోయేలా చేస్తుంది.

మొదటి భాగంలో సినిమా చాల స్లో పేస్‌లో మొదలవుతుంది, కానీ శంకర్ కథతో పాటు సమాంతరంగా వచ్చే మరో రెండు కథలు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి. మొదటి భాగంలో మంచి విజువల్స్, నేపధ్య సంగీతంతో ఎంగేజ్ చేసినప్పటికీ, స్లో కథనం కాస్త బోర్ కొట్టిస్తుంది.

ఇక రెండవ భాగంలో శంకర్ ప్రయాణం అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది, పైన మిగతా రెండు కథలు కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించవు. కానీ ప్రతి సన్నివేశం ఎదో ఒక పెద్ద మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రీ క్లయిమాక్స్ నుంచి కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది మరియు ట్విస్ట్ కూడా చాల షాకింగ్ గా ఉంటుంది.

నటన విషయానికి వస్తే, విశ్వక్ సేన్ శంకర్ పాత్రకి న్యాయం చేసాడు, తన కెరీర్ స్టార్టింగ్లో ఒప్పుకున్నా సినిమా అయిన, తన లుక్ అని ఆరేళ్ళ పాటు కన్సిస్టెన్సీ గా చూపించగలిగాడు. చాల సన్నివేశాలు నటనని డిమాండ్ చేస్తాయి, ఆ సన్నివేశాల్లో సరైన భావోద్వేగం పలికించకపోతే ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేడు కానీ విశ్వక్ సేన్ ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించాడు. ఇక చాందిని చౌదరి పాత్ర కుడా చాల ముఖ్యామైన పాత్ర అవడంతో తను కూడా బాగా చేసింది. అభినయ అనంతలో బాగా చేసింది, ఇక మిగిలిన నటీనటులు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

ఇలాంటి కథని తక్కువ బడ్జెట్ లో ఉన్నంతంగా తెరకెక్కించిన విద్యాధర్ అభినందించాల్సిందే. ఎదో హాలీవుడ్ మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే చాల వరకు లాజిక్స్ పక్కన పెట్టేయడం, చాల సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం, శంకర్ కథ కాకుండా మిగతా రెండు కథలు ఇంకా క్లుప్తంగా లేకపోవడం మైనస్ అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడు.

సాంకేతికంగా గామి ఉన్నతంగా ఉంటుంది, అక్కడక్కడా VFX సరిగా లేకపోయినా మొత్తం మీద బాగుంది.ఈ సినిమాకి నరేష్ కుమారన్ నేపధ్య సంగీతం మరియు విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ మేజర్ ప్లస్ పాయింట్స్.

చివరగా, గామి ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాల్సిన సినిమా.

ప్లస్ పాయింట్లు:

  • విజువల్స్
  • నేపధ్య సంగీతం
  • ఛాయాగ్రహణం

మైనస్ పాయింట్లు:

  •  స్లో కథనం

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు