టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టి SSMB29 పైనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కనున్న ఈ భారీ సినిమా గురించి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్‌లో జరిగిన చిట్‌చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్ బాబు తన అకౌంట్‌లో “its November already ” అని ట్వీట్ చేశారు, అందులో రాజమౌళి గారిని టాగ్ చేసారు. ఈ ట్వీట్‌తోనే అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది — “ఇది SSMB29 గురించేనా?” అని ఊహాగానాలు మొదలయ్యాయి.
కొద్దిసేపటికే రాజమౌళి స్పందిస్తూ,
“Yes, a cinemaki review iddam anukuntunnavu ee month” అని రిప్లై ఇచ్చారు.
ఈ ఒక లైన్‌తోనే సోషల్ మీడియాలో సంచలనం రేగింది. ఫ్యాన్స్ “రాజమౌళి – మహేష్ మాస్ అప్‌డేట్ రాబోతోందా?” అంటూ హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్రెండ్స్ మొదలుపెట్టారు.
ఆ తర్వాత ప్రియాంక చోప్రా మరియు ప్రిథ్వీరాజ్ సుకుమారన్ కూడా ట్వీట్ చేసి, చివరికి ఈ సినిమాకి సంబందించిన ఒక అప్డేట్ ఈ నవంబర్ 15 న రాయబోతున్నట్లు అభిమానులకి ఒక శుభవార్త అయితే చెప్పేసారు.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, SSMB29 ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతోంది. మహేష్ బాబు ఇప్పటివరకు చేయని లుక్, పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ షెడ్యూల్ 2025 మొదట్లో ప్రారంభం అయ్యి కొన్ని షెడ్యూల్స్ విజయవంతంగా ముగించారు కూడా.
ఇపుడు ఫ్యాన్స్ ఈ ట్వీట్లపై సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు:
“Rajamouli + Mahesh = History Loading!”
“SSMB29 update on the way. We are ready!”
హ్యాష్‌ట్యాగ్స్ #SSMB29, #MaheshBabu, #Rajamouli, #SSMB29Update ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అంటేనే అభిమానులకు పండుగ. ఇప్పుడు వీరి ట్విట్టర్ సంభాషణతో ఆ పండుగ ముందుగానే మొదలైంది.
నవంబర్ 15 వచ్చే అప్‌డేట్‌పై టాలీవుడ్ దృష్టి అంతా కేంద్రీకృతమైంది.
