
శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన “సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఈ సినిమా థియేటర్లో విడుదల అయినా తర్వాత మొదటగా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవ్వాలి, కానీ ఏమైందో కానీ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను దక్కించుకుంది.
ఇక ఈ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం 2026 ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
శివాజీ, లయలతో పాటు అలీ, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.
ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, రంజిన్ రాజ్ సంగీతం అందించారు. రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించగా, శివాజీ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
