
శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించిన మెన్షన్ హౌస్ మల్లేష్ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది.
ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో శ్రీనాథ్ మగంటి తో పాటు గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల, రాజ్హేష్, మురళీధర్ గౌడ్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, సాయి ప్రసన్న, పద్మ నిమ్మనగోటి, హరి రెబల్ తదితరులు నటించారు.
ఈ చిత్రాన్ని బాల సతీష్ రచించి దర్శకత్వం వహించగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. అమ్మముత్తు సినిమాటోగ్రఫీ నిర్వహించగా, కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్హేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
