
పుష్కర్ & గాయత్రి భారతదేశంలో అత్యంత విజయవంతమైన దర్శకనిర్మాతలు. వారు సూడల్, వదంది వంటి అద్భుతమైన సిరీస్‌లను అందించారు.
ఇప్పుడు వారు నిర్మాతలుగా ‘Exam: The System Exposed’ అనే సిరీస్‌తో వస్తున్నారు. ఈ సిరీస్ మే 15, 2026న ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.
ఇది తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్‌లో దషారా విజయన్, అబ్బాస్, అదితి బాలన్, వసుందర కశ్యప్ తదితరులు నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు ఎ. సర్కునం దర్శకత్వం వహించగా, పుష్కర్ మరియు గాయత్రి వాల్ వాచర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించారు.
