
దర్శకుడిగా పెళ్లిచూపులు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ఆ తర్వాత నటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన గాయపడ్డ సింహం సినిమా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
అయితే విడుదలైన మూడు వారాల్లోనే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ కామెడీ డ్రామా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్‌తో పాటు శ్రీ విష్ణు, మానసా చౌదరి, జె.డి. చక్రవర్తి, ఫారియా అబ్దుల్లా, కాశ్యప్ శ్రీనివాస్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ అందించారు. స్వీకర్ అగస్తి సంగీతం సమకూర్చారు. కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మాతలుగా వ్యవహరించారు.
