
ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన యాక్షన్ చిత్రం కేడి థ డెవిల్ ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను అందుకుంది.
ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.కేడి థ డెవిల్ జూన్ 05, 2026 నుంచి Zee5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమాలో ధృవ సర్జాతో పాటు రీష్మా ననయ్య, శిల్పా శెట్టి, సంజయ్ దత్, రమేష్ అరవింద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించగా, అర్జున్ జన్య సంగీతం అందించారు. విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
