కార్మేని సెల్వం OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగు వెర్షన్ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

కార్మేని సెల్వం OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగు వెర్షన్ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే

టాలెంటెడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ‘కార్మేని సెల్వం’ ఇటీవల తమిళం, తెలుగులో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను అందుకుంది.

ఇప్పుడు ఈ ఎమోషనల్ డ్రామా OTT అరంగేట్రానికి సిద్ధమైంది. కార్మేని సెల్వం సినిమా 2026 జూన్ 05 నుంచి Prime Video లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాలో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మి ప్రియా, అభినయ, కార్తీక్ కుమార్, బడవ గోపి, మధుమిత, అర్జునన్, సంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్, కొతండం, కరణ్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించగా, యువరాజ్ దక్షన్ సినిమాటోగ్రఫీ అందించారు. రామానుజన్ ఎంకే సంగీతాన్ని సమకూర్చగా, అరుణ్ రంగరాజులు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు