ఓటీటీలోకి వస్తున్న ‘లవ్ ఓ లవ్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి వస్తున్న ‘లవ్ ఓ లవ్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

నటుడు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం సినిమాతో గుర్తింపు పొందిన పవిష్, అలాగే తెలుగు పాటలతో పేరు తెచ్చుకున్న నాగ దుర్గా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్ ఓ లవ్.

ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా నిర్మాతలు బాగానే ప్రమోట్ చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది.

లవ్ ఓ లవ్ జూలై 31, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

పవిష్, నాగ దుర్గాతో పాటు ఈ చిత్రంలో కె.ఎస్. రవికుమార్, సెల్వరాఘవన్, రమ్యా, అశ్వత్, సౌందర్య, వనిత విజయకుమార్, ఆదిత్య కథిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి మాగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించగా, పి.జి. ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందించారు. ఫాక్స్‌న్ సంగీతాన్ని సమకూర్చగా, దినేష్ రాజ్ మరియు జి. ధనంజేయన్ నిర్మాతలుగా వ్యవహరించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు