
‘గట్టా కుస్తీ’ భారీ విజయాన్ని సాధించిన తర్వాత, అదే బృందం ‘గట్టా కుస్తీ 2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ కామెడీ-డ్రామా చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
‘గట్టా కుస్తీ 2’ జూలై 31, 2026 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి,యోగి బాబు, కరుణాస్, మునిశ్కాంత్, కాలీ వెంకట్, కరుణాకరన్, రమ్యకృష్ణ, మోక్ష, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించగా, షాన్ రోల్డన్ సంగీతాన్ని సమకూర్చారు. కేఎం భాస్కరన్ సినిమాటోగ్రఫీ అందించగా, డా. ఈశారి కె. గణేష్ మరియు విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
