
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓ సుకుమారి’ చిత్రం 2026 జూలై 17న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన కేవలం రెండు వారాలకే ఓటీటీలోకి రానుంది. ‘ఓ సుకుమారి’ ఆగస్టు 7, 2026 నుంచి ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.
తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌తో పాటు ఈ చిత్రంలో ఆమని, మురళీధర్ గౌడ్, ఝాన్సీ, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి భారత్ దర్శన్ దర్శకత్వం వహించగా, సి. హెచ్. కుషేందర్ సినిమాటోగ్రఫీ అందించారు. భరత్ మంచిరాజు సంగీతం సమకూర్చగా, మహేశ్వర రెడ్డి మూలి నిర్మాతగా వ్యవహరించారు.
