Baa Baa Black Sheep OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Baa Baa Black Sheep OTT ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన ఈ తెలుగు క్రైమ్ కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

బా బా బ్లాక్ షీప్ (Baa Baa Black Sheep) నవంబర్ 6, 2026 నుంచి సన్ ఎన్‌ఎక్స్‌టీ (Sun NXT)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కేవలం తెలుగు భాషలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, విష్ణు ఓయ్, కశ్యప్, కార్తికేయ దేవ్, విస్మయ శ్రీ, రాజా రవీంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, టిన్ను ఆనంద్, సమృద్ధి ఆర్యల్, మాళవిక మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి గుని మంచికంటి దర్శకత్వం వహించగా, ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ ఆర్కాడో సంగీతం అందించారు. అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. వేణు దొనేపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు