ఈ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. హైకూ చిత్రం నవంబర్ 20, 2026న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో ఏగన్, శ్రీ దేవి, ఆదిర్చి అరుణ్, ఫెమినా జార్జ్, మైమ్ గోపీ, సుబ్రమణియన్ సేతు, ఇందుమతి మణిగందన్, అధియమాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
యువరాజ్ చిన్నసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సిద్ధు కుమార్ సంగీతం అందించారు. ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డాక్టర్ డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మించారు.
