418 OTT Release Telugu: నెట్‌ఫ్లిక్స్‌లోకి ప్రశాంత్ నీల్ సమర్పించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

418 OTT Release Telugu

కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హారర్ మూవీ 418. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో పాటు ప్రశాంత్ నీల్ పేరు కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే, ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 418 సినిమా నవంబర్ 20, 2026న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రీమియర్ కానుంది.

ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో చైత్ర జె. ఆచార్, రమేష్ ఇంద్ర, కోట జయరామ్, గోపరాజు విజయ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శ్రీ వైష్ణవ్, శశాంక్ పాటిల్, సూర్య రాజ్ వీరభతిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

కీర్తన్ నడగౌడ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకీ జీజీ సంగీతం అందించగా, దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు