
ఈ తమిళ వెబ్ సిరీస్ను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఇది 2026 మే 27న జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానుంది.
జియోహాట్స్టార్ తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే చాలా రిలేటబుల్గా, ఎంటర్టైనింగ్గా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఈ సిరీస్ తెలుగు భాషలో కూడా అందుబాటులోకి రానుంది.
ఈ సిరీస్లో బోస్ వెంకట్, నిఖిలా శంకర్, రాజ్ అయ్యప్ప, గాయత్రి శాస్త్రి, సిద్ధార్థ్ బాబు, శ్రవనిత శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ కథను ఏ. సి. కరుణమూర్తి రచించగా, చిదంబరం మణివన్నన్ దర్శకత్వం వహించారు. మణికందన్ రామమూర్తి సినిమాటోగ్రఫీని నిర్వహించారు.
