
లావణ్య త్రిపాఠి నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
ఇప్పుడు విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ‘సతీ లీలావతి’ చిత్రం 2026 మే 20 నుంచి Sun NXT లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, నరేష్, సప్తగిరి, మోటా రాజేంద్రన్, వీటీవీ గణేష్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి టాటినేని సత్య దర్శకత్వం వహించగా, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. బినేంద్ర మెనన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, నాగ మోహన్ దుర్గా దేవి పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
