
దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన ‘మత్తు వదలరా 2’లో కమెడియన్ సత్య అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమా విజయానంతరం ఈ కాంబో మరోసారి ‘జెట్‌లీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే దురదృష్టవశాత్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘జెట్‌లీ’ చిత్రం 2026 మే 25 నుంచి జిఓహాట్స్టార్లొ స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో సత్య, వెన్నెల కిషోర్, అజయ్, హర్ష చెముడు, రియా సింగ్, శుభలేఖ సుధాకర్, కబీర్ దుహాన్ సింగ్, గుండు సుధర్శన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి రితేష్ రాణా దర్శకత్వం వహించగా, కాల భైరవ సంగీతాన్ని అందించారు. సురేష్ సరంగం సినిమాటోగ్రఫీ నిర్వహించగా, చెర్రీ మరియు హేమలత పెదమల్లు కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
