Meri Awaz Suno Telugu OTT: జయసూర్య మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్

Meri Awaz Suno Telugu OTT

జయసూర్య మరియు మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన మెరి ఆవాజ్ సునో చిత్రం 2022లో విడుదలై మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే థియేటర్లలో కాదు, నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

మెరి ఆవాజ్ సునో చిత్రం మే 27, 2026 నుంచి ETV Winలో స్ట్రీమింగ్ కానుంది. జయసూర్య, మంజు వారియర్‌లతో పాటు మిథున్ వేణుగోపాల్, అర్చిత్ అభిలాష్, శివదా, జానీ ఆంటోనీ, గౌతమి నాయర్, సుధీర్ కరమణ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి జి. ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించగా, వినోద్ ఇల్లంపల్లి సినిమాటోగ్రఫీని అందించారు. ఎం. జయచంద్రన్ సంగీతం సమకూర్చగా, యూనివర్సల్ సినిమాస్ బ్యానర్‌పై బి. రాకేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు