
ఈ తెలుగు వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.
‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 జూన్ 19, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సిరీస్‌లో ప్రియదర్శి పులికొండ, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, వెన్నెల కిషోర్, దేవియాని శర్మ, జబర్దస్త్ రోహిణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ ప్రాజెక్ట్‌కు శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించగా, అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు. ఎస్.వి. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. ఈ సిరీస్‌ను శివ మేకా మరియు సాహితి చింతలపూడి నిర్మించారు.
