
బాసిల్ జోసఫ్ గత కొన్ని సంవత్సరాలుగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆసక్తికరమైన సినిమాలు చేస్తున్నారు. నటుడిగా కూడా ఆయన ఎన్నో భిన్నమైన పాత్రల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.
అలాగే ఇటీవల మలయాళంలో విడుదలైన ‘అతిరధీ’ సినిమాలో కూడా బాసిల్ జోసఫ్ ఓ ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఈ సినిమా OTTలోకి రాబోతోంది.
‘అతిరధీ’ జూన్ 19, 2026 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమాలో బాసిల్ జోసఫ్, టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్, జరీన్ షిహాబ్, రియా షిబు, షాన్ రెహ్మాన్, విష్ణు అగస్త్య, షెల్విన్ జేమ్స్, పి. సుకుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహించగా, విష్ణు విజయ్ సంగీతం అందించారు. స్యామువెల్ హెన్రీ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, డా. ఎస్. అనంతు మరియు బాసిల్ జోసఫ్ ఈ సినిమాను నిర్మించారు.
