
పెద్ద సినిమాలకే ఇప్పుడు థియేటర్లలో ఎక్కువ రోజులు నిలబడటం కష్టంగా మారింది. ఇక చిన్న సినిమాల పరిస్థితి మరింత కఠినంగా ఉంది. అలానే చిన్న సినిమాగా విడుదలైన రమణి కళ్యాణం కూడా థియేటర్లలో ప్రేక్షకుల స్పందన లేక వాష్అవుట్ అయింది.
ఇప్పుడు ఈ సినిమా OTTలోకి రాబోతోంది. రమణి కళ్యాణం జూన్ 12, 2026 నుంచి సన్ నెక్స్ట్ మరియు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో సూర్య వశిష్ట, దీప్షిఖా చంద్రన్, చైతు జొన్నలగడ్డ, శ్రీనివాస రెడ్డి, ప్రభావతి, శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించగా, అరవింద్ తిరుకోవెల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సూరజ్ ఎస్. కురుప్ సంగీతం అందించగా, కైట్స్ క్రియేటివ్స్ ఈ సినిమాను నిర్మించింది.
