
ఇది త్వరలో విడుదల కానున్న తెలుగు చిత్రం. థియేటర్లలో విడుదల అవ్వాల్సిన చిత్రం ఇప్పుడు నేరుగా OTTలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ఆహా వీడియో సొంతం చేసుకుంది.
‘థ్యాంక్యూ సుబ్బారావు’ చిత్రం 2026 జూన్ 19 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో చంద్రహాస్ కోట్ల, మురళీధర్ గౌడ్, లావణ్య సాహుకారా, రోహిత్ రెడ్డి యర్రమరెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించగా, పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందించగా, దినేష్ కుర్రా నిర్మాతగా వ్యవహరించారు.
ఆహా వీడియో గత కొన్నేళ్లుగా మంచి కంటెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.
