దృశ్యం 3 ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఎక్కడ ప్రసారం కానుందంటే?

దృశ్యం 3 ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఎక్కడ ప్రసారం కానుందంటే

దృశ్యం 3లో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు విడుదలైన నెల రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా జూన్ 18, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఇందులో మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపీ, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, ఛాయాగ్రహణాన్ని సతీష్ కురుప్ అందించారు. సంగీతాన్ని అనిల్ జాన్సన్ సమకూర్చగా, ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు