
బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ తమిళ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
‘బ్లాస్ట్’ సినిమా 2026 జూన్ 25న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వీక్షించవచ్చు.
ఈ చిత్రంలో అర్జున్, ప్రీతి ముఖుందన్, అభిరామి, వివేక్ ప్రసన్న, జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం, బాలా హసన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సుభాష్ కె. రాజ్ దర్శకత్వం వహించగా, రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
