సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.

సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతమైన నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సిరీస్ 2026 జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

గ్రామీణ నేపథ్యంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ఈ సిరీస్‌లో సందీప్ కిషన్‌తో పాటు మిథిలా పాల్కర్, బ్రహ్మానందం, మానసా చౌదరి, హైపర్ ఆది, మురళీ శర్మ, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ ప్రాజెక్ట్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా, రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు