
వైవిధ్యమైన కథలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు రవిబాబు రూపొందించిన ‘రేజర్’ చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మలచడంలో సినిమా విఫలమైంది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘రేజర్’ సినిమా 2026 జూన్ 19 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో రవిబాబు, ఇనాయా సుల్తానా, మీనా వాసు, తనీష్, ప్రణవి మానుకోండా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహించగా, చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఫ్లయింగ్ ఫాగ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా, సురేష్ బాబు సమర్పించారు.
