
2000 సంవత్సరంలో టెలివిజన్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన సీరియల్ ‘మర్మదేశం’. తమిళంలో రూపొందిన ఈ సీరియల్ తెలుగులో కూడా డబ్ అయి ప్రేక్షకుల ఆదరణ పొందింది.
ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘మర్మదేశం’ వల్డ్ నుంచి ‘వీరభద్రుని రహస్యం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొత్తం 60 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ 2026 జూలై 1 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రతి వారం ఒక ఎపిసోడ్ విడుదల చేయనున్నారు. ఈ సిరీస్లో రఘు కుంచె, రఘు, శిరీష, అనూరాధ, హార్విన్ రెడ్డి, బాలచంద్ర, ఎస్ఐ రవి, కమల్ తుము, కల్కి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి ఈ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఒకవేళ మీరు ‘మర్మదేశం’ అభిమానులైతే ఈ సిరీస్ను అస్సలు మిస్ అవ్వకండి.
