Heart Beat Season 3 రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగు స్ట్రీమింగ్‌పై కూడా క్లారిటీ!

Heart Beat Season 3 రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగు స్ట్రీమింగ్‌పై కూడా క్లారిటీ

‘హార్ట్ బీట్’ రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న, 200కు పైగా ఎపిసోడ్‌లు ఉన్న తమిళ వెబ్ సిరీస్. మెడికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘హార్ట్ బీట్ సీజన్ 3’ జూలై 30, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ, మేకర్స్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ సిరీస్‌లో అనుమోల్, దీపా బాలు, కార్తిక్ కుమార్, చారుకేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించారు.

‘హార్ట్ బీట్’ సీజన్ 1, సీజన్ 2 ఇప్పటికే తెలుగులో అందుబాటులో ఉన్నాయి. సీజన్ 3 తెలుగు వెర్షన్‌పై మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇది తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు