ఓటీటీలోకి వస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఓటీటీలోకి వస్తున్న రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా ప్రమోట్ చేసిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా చివరికి సగటు వసూళ్లతో తన థియేట్రికల్ రన్‌ను ముగించింది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘పెద్ది’ జూలై 9, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివ రాజ్‌కుమార్, బోమన్ ఇరానీ, చమ్మక్ చంద్ర, సత్య, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా కథ, దర్శకత్వం వహించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీని రత్నవేలు నిర్వహించారు. వృద్ధి సినిమా బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు