
2025లో థియేటర్లలో విడుదలైన షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బాల్టి’ ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.
‘బాల్టి’ జూలై 10, 2026 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో షేన్ నిగమ్‌తో పాటు ప్రీతి అస్రానీ, అల్ఫోన్స్ పుత్రెన్, సెల్వరాఘవన్, శాంతను భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి ఉన్ని శివలింగం దర్శకత్వం వహించగా, సాయి అభ్యాంకర్ సంగీతాన్ని సమకూర్చారు. అలెక్స్ జె. పులికల్ సినిమాటోగ్రఫీ అందించగా, సంతోష్ టి. కురువిల్లా, బిను జార్జ్ అలెగ్జాండర్ నిర్మాతలుగా వ్యవహరించారు.
