
బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన ఈ తమిళ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
త్రికాల జూలై 09, 2026 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో మహేంద్రన్, శ్రద్ధా దాస్, అజయ్, సాహితి అవంచా, ఆమని, సాయి ధీనా, ఈటీవీ ప్రభాకర్, అంబటి అర్జున్, రోబో శంకర్, రౌడీ రోహిణి, స్పైడర్ సంజయ్, కల్లూరి వినోత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి మణి తెల్లగుటి దర్శకత్వం వహించగా, పవన్ చెన్నల్ సినిమాటోగ్రఫీని అందించారు. షాజిత్ హుమాయూన్ సంగీతం సమకూర్చగా, రాధికా శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించారు.
