
ఈ మలయాళ మెడికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ, ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
‘డోస్’ చిత్రం 2026 జూలై 10 నుంచి Lionsgate Play మరియు Prime Videoలో స్ట్రీమింగ్ కానుంది. ఇది మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రంలో సిజు విల్సన్, అశ్విన్ కె. కుమార్, జగదీష్, కిషా కురుప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి అభిలాష్ ఆర్. నాయర్ దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీని విష్ణుప్రసాద్, సంగీతాన్ని గోపీ సుందర్ అందించారు. ఈ చిత్రాన్ని శాంటో థామస్ నిర్మించారు.
