
నటుడు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం సినిమాతో గుర్తింపు పొందిన పవిష్, అలాగే తెలుగు పాటలతో పేరు తెచ్చుకున్న నాగ దుర్గా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్ ఓ లవ్.
ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా నిర్మాతలు బాగానే ప్రమోట్ చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది.
లవ్ ఓ లవ్ జూలై 31, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
పవిష్, నాగ దుర్గాతో పాటు ఈ చిత్రంలో కె.ఎస్. రవికుమార్, సెల్వరాఘవన్, రమ్యా, అశ్వత్, సౌందర్య, వనిత విజయకుమార్, ఆదిత్య కథిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి మాగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించగా, పి.జి. ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందించారు. ఫాక్స్న్ సంగీతాన్ని సమకూర్చగా, దినేష్ రాజ్ మరియు జి. ధనంజేయన్ నిర్మాతలుగా వ్యవహరించారు.
