
ఎన్నో ఏళ్ల తర్వాత అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆయన విజయంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ‘లెనిన్’ చిత్రం 2026 ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ, ప్రమోద్ పంజు, సునీల్, ఈశ్వరి రావు, రామ్‌కీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు కథ, దర్శకత్వం వహించగా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. అక్కినేని నాగార్జున మరియు సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా మనమ్ ఎంటర్‌ప్రైజెస్ LLP మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
