‘నూరూ సామి’ OTT అప్‌డేట్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ పూర్తి వివరాలు

నూరూ సామి' OTT అప్‌డేట్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ పూర్తి వివరాలు

విజయ్ ఆంటోనీ నటించిన గ్రామీణ నేపథ్యంలో రూపొందిన డ్రామా ‘నూరూ సామి’ థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

‘నూరూ సామి’ చిత్రం 2026 ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీతో పాటు స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్, అరుల్‌దాస్, మునిష్‌కాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి ససి దర్శకత్వం వహించగా, ఎస్. బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ అందించారు. బాలాజీ శ్రీరామ్ సంగీతాన్ని సమకూర్చగా, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు