
గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ డ్రామా చిత్రం ఇది.
థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, పర్వాలేదనిపించే స్పందనను అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
గరివిడి లక్ష్మి నవంబర్ 27, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో కాయల్ ఆనంది, రాగ్ మయూర్, శ్రీనివాస్ అవసరాల, అంకిత్ కొయ్య, వీకే నరేష్, రాశి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించగా, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
