Hanuman Ansh OTT Release: ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న రూ.100 కోట్ల మూవీ

Hanuman Ansh OTT Release

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తక్కువ పెట్టుబడితో రూపొందినప్పటికీ, ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన అనంతరం‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 29, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తమిళం, కన్నడ, తెలుగు, మలయాళంలో ప్రీమియర్ కానుంది ఇక హిందీ వెర్షన్ సోనీలివ్ ప్రీమియర్ కానుంది.

ఈ చిత్రంలో శోభినవ్ సత్య, విహాన్ షెడ్గే, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవందాస్ పటేల్, చందన్ కె. ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

విశాల్ చతుర్వేది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విశాల్ బావా సినిమాటోగ్రఫీ అందించారు. రాగిణి ఎస్., నమ్రత జి. సింగ్, అనుప్రియ ఎ. నగర్, విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు