Balli Sastram: బల్లి శాస్త్రం ఫిలితాలు, శుభాలు, అశుభాలు, దోశాలు

Balli Sastram: బల్లికి జాతక శాస్త్రంలో ప్రముఖ మైన స్థానం ఉంది. హిందూ పురాణాల్లో అనేక మంది దేవుళ్ల మనకు ఎన్నో జంతువుల ముఖాలతో కనిపిస్తారు. సింహం ముఖంతో నరసింహ స్వామి, పంది ముఖంతో వరాహవతారం, ఏనుగు ముఖంతో గణపతి, పాము ముఖంతో నాగదేవత. అయితే బల్లి ముఖంతో ఏ దేవతా కనిపించనప్పటికీ బల్లి అనేక శుభాలను, అశుభాలను సూచిస్తుంది. బల్లి శరీరం మీద ఎక్కడ పడిందనే దానిని బట్టి అది శుభమా అశుభమా అని గౌలి పఠన శాస్త్రం ద్వారా పండితులు మనకు చెబుతూ వస్తున్నారు.

Balli Sastram
Balli Sastram

బల్లి శాస్త్రం తెలుగులో

బల్లి శాస్త్రం అందరికీ ఒకేలా ఉండదు. పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పురుషులకు బల్లి ఎడమవైపు పడితే శుభం అదే స్త్రీలకు అశుభంగా గోచరిస్తుంది. ఇలా అనేక రకాల వేరియేషన్స్ ఉన్నయి. ఈ ఆర్టికల్ లో మీకు ఈ బల్లి శాస్త్రం వివరాలను డిటెయిల్డ్ గా మీకు అందిస్తున్నాము.

బల్లి శాస్త్రం స్త్రీలకు ప్రభావం

స్త్రీలు ఎక్కువగా వంటగదిలోనే ఉంటారు, బల్లులు కూడా అక్కడే ఎక్కువగా ఉంటాయి. దీని ఆధారంగా స్త్రీలపైనే బల్లి ఎక్కువగా పడే అవకాశం ఉంది. స్త్రీల శరీరం పై ఎక్కడ పడితే లాభం ఎక్కడ పడితే లాభం లాంటి విషయాలను తెలుసుకుందాం.

బల్లి శాస్త్రం స్త్రీలకు పడితే కలిగే అశుభాలు

స్త్రీల శరీర భాగంఅశుభం
తలపైమరణ భయం
కొప్పు పైరోగాల భయం
కుడి కన్నుమనోవ్యధ, అనవసరమైన టెన్షన్స్
రెండు పెదవులపైకష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి
వీపు పైమరణవార్త వింటారు
గోళ్ల పైచిన్న చిన్న కలహాలు, గొడవలు
ఎడమ చేయిమెంటల్ స్ట్రైన్, అనవసరమైన ఒత్తిడి
చీలమండముకష్టాలు
పై పెదవివిరోధములు కలుగుతాయి

బల్లి శాస్త్రం ఫలితాలు స్త్రీలకు కలిగే శుభాలు

స్త్రీల శరీర భాగంశుభం
కుడికాలుశత్రు నాశనం జరుగుతుంది
కాలి వేళ్లుపుత్రుడు జన్మిస్తాడు
రొమ్ము లేక వక్షస్థలంమంచి జరుగుతుంది
కుడి చెంపమగ శిశువు జన్మిస్తాడు
కుడి చెవిధన లాభం, ఆదాయం
వేళ్లపైనగల ప్రాప్తి
కుడి భుజంకామ రాతి ప్రాప్తి కలుగుతుంది
భుజంనగల ప్రాప్తి
తొడలుకామము
మోకాళ్లుఆదరణ, అభిమానం, బంధము
చేతులపైధన లాభం
పిక్కల పైబంధువుల రాక
ఎడమ కన్నుమీ భర్తజదగ్గరైన వారి ప్రేమ పొందుతారు
కింది పెదవికొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి

బల్లి శాస్త్రం పురుషులకు వేరుగా చెబుతుంది. పురుషులకు కూడా కొన్ని సందర్భాల్లో మేలు మరికొన్ని సందర్భాల్లో కీడు జరుగుతుంది. బల్లి పడిన శరీర భాగాన్ని బట్టి ఆ వ్యక్తికి కలిగే శుభా, అశుభాల గురించి గౌలి పఠన శాస్త్రం చాలా వివరంగా చెప్పింది. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దం.

బల్లి శాస్త్రం పురుషులకు పడితే కలగే అశుభాలు

 పురుశుల శరీర భాగంఅశుభం
వీపు పై కుడి వైపురాజ భయం
మోచేయిడబ్బు నష్టం
కుడి భుజంకష్టాలు, సమస్యలు
ఎడమ భుజంపదిమందిలో అగౌరవం జరుగుతుంది
తొడలుదుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి
మీసాలపైకష్టాలు వెంటాడతాయి
కాలి వేళ్లపైఅనారోగ్య సమస్యలు
తలపై భాగానమరణం వెంటాడుతున్నట్లు
కుడి కన్నుచేసిన పని విజయవంతం కాదు, అపజయం కలుగుతుంది
నుదురు పైఇతర సమస్యలతో చిక్కుకోవడం, విడిపోవడం
కుడి చెంపబాధపడటం
పై పెదవికలహాలు వంటపడుతాయి
రెండు పెదవుల మధ్యమృత్యువు సంభవిస్తుంది

బల్లి శాస్త్రం పురుషులకు పడితే కలిగే శుభాలు

పురుశుల శరీర భాగంశుభం
మణికట్టుఅలంకార ప్రాప్తి కలుగుతుంది
వ్రేళ్ల పైఅనుకోకుండా బంధువ, స్నేహితుల రాక
పాదముల పైప్రయాణానికి సిద్ధం
ముఖంపైఆర్దిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు
ఎడమ కన్నుఅంతా శుభమే జరుగుతుంది
ఎడమ చెవిఆదాయం బాగా వస్తుంది, లాభము
కింది పెదవిఆదాయంలో లాభం కలుగుతుంది
వీపు పై ఎడమ భాగంవిజయం కలుగుతుంది

దోశం పూర్తిగా తొలగిపోవాలంటే?

బల్లి మీద పడితే ఎంత పెద్ద దోశం అయినా సరే అది మరణ గండమైనా గానీ తొలగిపోయే మార్గాలను పండితులు చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలోని కంచి కామేశ్వరీ అమ్మవారి ఆలయంలో బంగారు బల్లి ఉంది. బల్లి దోశం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎంత పెద్ద బల్లి దోశమైనా సరే తొలగిపోతుంద. కొన్ని కారణాల చేత ప్రతీ ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకోలేదు. అలాంటి వారు ఈ బంగారు బల్ల దర్శనం చేసుకున్న వారి కాళ్లకు నమస్కారం చేయాలి. అలా చేని బల్లి దోశం తొలగి పోతుంది.

బల్లి మీద పడగానే దిగ్భ్రాంతికి లోను కాకుండా వెంటనే శుభ్రంగా స్నానం చేసుకోవాలి. ఆ తరువాత పూజామందిరంలోకి వెళ్లి దీపం వెలిగించి, దోశం ఏదైనా ఉంటే తొలగించమని దేవుడికి ప్రార్ధించాలి. రాత్రి సమయంలో బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉండవని గౌలిపఠన శాస్త్రం చెబుతుంది.

FAQ

1. బల్లి పడితే ఏం చేయాలి?

బల్లి మీద పడడం చాలా సాధారణ విషయం. బల్లులు ఎక్కువగా వంట గదుల్లో, స్టోర్స్ రూమ్స్ లో ఉంటాయి. కాబట్టి స్త్రీలపైనే బల్లి ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. బల్లి మీద పడగానే ఆందోళన చెందకుండా వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి. అనంతరం పూజామందిరంలోకి వెళ్లి దీపం వెలిగించి దేవుడికి ప్రార్ధించాలి. మీ దగ్గర బల్లి శాస్త్రాం ఉంటే ఎక్కడ పడిందో దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూస్కోడి. ఈ ఆర్టికల్ లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాము.

2. బల్లి మీద పడితే ఫలితాలు?

బల్లి చూడ్డానికి అసహ్యంగా ఉన్నప్పటికి శరీరంపై కొన్ని భాగాలపై పడితే చాలా శుభం జరుగుతుంది. ఉదాహరణకు పురుశుల ముఖం పై బల్లి పడితే లాభాల బాట పడతారు. స్త్రీల కుడి చెవి పై పడితే కూడా మంచి ఆదాయం కలుగుతుంది.

3. బల్లి శాస్త్రం పురుషులకు కుడి కాలు?

పురుషుల కుడి కాలి వేళ్లపై పడితే బంధువుల రాక, స్నేహితుల రాక అని గౌలి పఠన శాస్త్రంలో ఉంది.

4. బల్లి శాస్త్రం స్త్రీలకు pdf?

బల్లి శాస్త్రం స్త్రీలకు పురుషులకు వేరు వేరు గా ఉంటుంది. స్త్రీలపై బల్లి ఎక్కుడ పడితే ఏ లాభ నష్టాలు ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ లింక్ పై బల్లి శాస్త్రం స్త్రీలకు pdf  క్లిక్ చేయండి.

5. బల్లి శాస్త్రం పురుషులకు pdf

బల్లి శాస్త్రం పురుషులకు ప్రత్యేకంగా చెప్పబడింది. పురుషుల శరీరంపై ఎక్కడ పడితే ఏలాభం ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ లింక్ ను  బల్లి శాస్త్రం పురుషులకు Pdf ఓపెన్ చేయండి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

  1. బల్లి నకు థాగల లేదే నెను పుట్టు వేసుకుంటే కూడి కాళ్లు వేలకు టార్చ్ ఇంధ ధీని ప్రభావం అమిటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు