Vivo కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు Vivo X300 మరియు Vivo X300 Pro ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్లు ప్రీమియం ఫీచర్లతో, శక్తివంతమైన కెమెరా మరియు ఫాస్ట్ ప్రాసెసర్‌తో వచ్చాయి. ధర ₹75,999 నుంచి మొదలవుతుంది.

ధర & వేరియంట్లు
Vivo X300 (12GB + 256GB) ధర: ₹75,999
Vivo X300 (12GB + 512GB) ధర: ₹81,999
Vivo X300 (16GB + 512GB) ధర: ₹85,999
Vivo X300 Pro (16GB + 512GB) ధర: ₹1,09,999
ఈ ఫోన్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ముఖ్యమైన ఫీచర్లు (Key Specifications):
ప్రాసెసర్: MediaTek Dimensity 9500 – వేగంగా పనిచేసే పవర్‌ఫుల్ చిప్
కెమెరా: 200MP మెయిన్ కెమెరా (Pro మోడల్), ట్రిపుల్ కెమెరా సెటప్
డిస్ప్లే: X300–6.31 inch AMOLED, X300 Pro–6.78 inch LTPO AMOLED
బాటరీ: X300–6040mAh, Pro–6510mAh + ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
OS: Android 16 (OriginOS)
Features: 5G సపోర్ట్, ప్రీమియం డిజైన్, అత్యద్భుత ఫోటోగ్రఫీ పనితనం
ఫోటోగ్రఫీ, వీడియోలు ఎక్కువగా తీసేవారికి 200MP కెమెరా చాలా ఉత్తమమైనది. గేమింగ్ & హెవీ మల్టిటాస్కింగ్ కోసం Dimensity 9500 మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. ప్రీమియం డిజైన్ & పెద్ద డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్ ఇలా అన్ని విధాలుగా ఈ ఫోన్ ఒక ఆల్ రౌండర్.
సెలెక్టెడ్ బ్యాంకులపై 10% cashback ఆఫర్ కూడా ఉంటుంది. కొన్ని బండిల్ ఆఫర్లతో free earbuds లభించే అవకాశం కూడా ఉంది.
Vivo X300 మరియు X300 Pro భారత మార్కెట్‌లో పోటీని పెంచే ఫోన్లు. కెమెరా, పెర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, బ్యాటరీ అన్ని రంగాల్లో కూడా ఈ సిరీస్ చాలా బలంగా ఉంది. ప్రీమియం రేంజ్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్.
