Bigg Boss 8 Telugu Elimination Week 2: బిగ్ బాస్ 8 తెలుగు ఎలిమినేషన్ వీక్ 2

బిగ్ బాస్ 8 తెలుగు షో రెండవ వారంలో కొనసాగుతుండగా మంచి స్వింగ్‌లో ఉంది. మొదటి వారం బేబక్క హౌస్ నుండి ఎలిమినేట్ అయింది, ఇది చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె నిష్క్రమణ మిగిలిన హౌస్‌మేట్స్‌లో తీవ్రమైన పోటీ మరియు వ్యూహాత్మక గేమ్‌ప్లేకు వేదికగా నిలిచింది. మీకు bigg boss 8 telugu voting తెల్సుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Bigg Boss 8 Telugu Elimination Week 2

రెండవ వారం నామినేషన్స్ మొదలయ్యాయి,శేఖర్ బాషా, ఆదిత్య ఓం, విష్ణు ప్రియ, అబ్బాయి నవీన్, నిఖిల్, సీత, నైనికా, పృథ్వీ మరియు మణికంఠ నామినెటే అయ్యారు. ఇక వోటింగ్ రిసల్ట్ చూస్కుంటే.

మొదట్లో సీత కి చాల తక్కువ ఓట్లు వచ్చాయి, కానీ ఆ తర్వాత సీత గేమ్ చాల బాగా ఆడింది. ఆమె తోటి పోటీదారులు మరియు వీక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్నట్టుండి వోటింగ్ రిసల్ట్ పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం, శేఖర్ బాషాకి చాల తక్కువ ఓట్లు వచ్చాయి, శేఖర్ బాషా చాల మెచ్యూర్ గా మాట్లాడతాడు కానీ, గేమ్ పరంగా చూస్కుంటే సరిగా ఆడట్లేదు అనే చెప్పాలి.

ప్రమాదంలో ఉన్న మరో పోటీదారు ఆదిత్య ఓం. అతని గేమ్‌ప్లే ఇప్పటివరకు తక్కువగా ఉంది మరియు అతని ప్రదర్శన పట్ల చాలా మంది అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు. ఓటింగ్ రిసల్ట్ లో దిగువన లేనప్పటికీ, అతని గేమ్ సరిగా లేనందున ఎలిమినేట్ అయ్యే అవకాశలు ఎక్కువగా ఉన్నాయ్.

చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు