బిగ్ బాస్ 19 గ్రాండ్ ఫినాలే ఆదివారం రాత్రి అద్భుతంగా జరిగింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించిన ఈ ఫైనల్‌లో గౌరవ్ ఖన్నా అందరి అంచనాలకు నిజం చేస్తూ బిగ్ బాస్ 19 విన్నర్ గా నిలిచారు. ట్రోఫీతో పాటు భారీ క్యాష్ ప్రైజ్‌ని కూడా గెలుచుకున్నారు.

గౌరవ్ మొత్తం సీజన్‌లో చాలా కూల్ నేచర్, ఓర్పు, పాజిటివ్ ఆలోచనలు, గౌరవప్రదమైన ప్రవర్తనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. హౌస్‌లో జరిగిన వాదోపవాదాల్లో కూడా ఆయన నిగ్రహంతో స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
ప్రేక్షకులు సోషల్ మీడియాలో #GauravKhannaWinner హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. చాలా మంది నెటిజన్లు “Respect always wins”,“He deserved every bit of the victory” అని కామెంట్లు చేశారు.
బిగ్ బాస్ 19 ఫైనల్‌లో గట్టిపోటీ ఇచ్చిన రన్నర్-అప్ కూడా భారీ ప్రాచుర్యం పొందినా, చివరికి ఓపిక, ఒరిజినాలిటీ, డిగ్నిటీ విజయం సాధించింది.
ఎలాంటి పరిస్థితిలోనైనా శాంతంగా వ్యవహరించడం, డ్రామాకు దూరంగా ఉండటం, అందరిని గౌరవించడం, టాస్క్‌లలో నిబద్ధత, ఎవరిని పొగడాలేదు, విమర్శించలేదు, సింపుల్‌గా గేమ్ ఆది గెలిచాడు గౌరవ్ ఖన్నా.
బిగ్ బాస్ 19 సీజన్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. గౌరవం, ఓర్పు, మరియు నిజాయితీ చివరికి గెలుస్తాయి. Congratulations ఛాంపియన్ గౌరవ్ ఖన్నా!
