Weight Loss Tips: రెండల్ల నుంచి కరోనా కారణంగా అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది ఇంటి నుంచే వర్క్ ఫ్రం ఫోమం చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ వెయిట్ పెరగని వారు కూడా చాలా లావయిపోయారు. ఇంట్లోనే ఆఫీస్, అప్పుడప్పుడు లాక్ డౌన్ల కారణంగా జిమ్‌లు కూడా మూతబడ్డాయి. అయితే జిమ్ కు వెళ్లకుండా, వేలు ఖర్చు చేయకుండా మీరు సులువుగా బరువు తగ్గే టిప్స్ ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాము. వీటిని ఫాలో అయి బరువు తగ్గండి, అందంగా ఆరోగ్యంగా ఉండండి.

బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు
నిమ్మ తేనే నీళ్లు
రోజు ఉదయం లేవగానే పరిగడపున ఓ గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండుకొని ఒక చెంచా తేనె వేసుకొని కలుపుకొని తాగండి ఇలా చేస్తే మీ బాడీలో కొవ్వు త్వరగా కరుగుతుంది. నోట్లో దుర్వాసనని కూడా పోతుంది. జీర్ణ వ్యవస్థకి కూడా ఈ నిమ్మ తేనె నీళ్లు బాగా పనిచేస్తుంది.
డిటాక్స్ వాటర్
మనం రోజూ తాగా నీళ్లకు బదులుగా డిటాక్స్ వాటర్ తాగితే చాలా మంచిది. ఈ డిటాక్స్ వాటర్ ను ఇలా తయారు చేసుకోవచ్చు. ఒక జగ్ లో కొన్ని అల్లం ముక్కలు, కోసిన నిమ్మకాయ, కొన్న పూదినా ఆకులు వేయాలి. దాంట్లో నిండుగా నీళ్లు పోసి జగ్ మూతని క్లోస్ చేయాలి. ఈ డిటాక్స్ వాటర్ ను మీరు రోజూ తాగవచ్చు. అల్లం, నిమ్మకాయ, పుదీనాకు కు బదులుగా, పుచ్చకాయ, లేదా ఆపిల్, లవంగం దాచీన చెక్క వేసుకోవచ్చు. వీటిలో ఏవైనా మూడింటిని జగ్ నీళ్లలో కలిపితే డిటాక్స్ వాటర్ రెడీ.
పెరుగు సలాడ్
పెరుగు తింటే అది మనల్ని జంక్ ఫుడ్ పై ఆసక్తిని తగ్గిస్తుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ క్రియకు దోహదం చేస్తుంది. మలబద్దకం సమస్యకూడా రాదు. పెరుగులో కొవ్వు పదార్ధాలు కూడా ఉండవు. పెరుగులో ఉల్లిపాయ, దానిమ్మ, పచ్చిమిర్చి, పుదినా వేసి సలాడ్ లా చేసుకొని తినవచ్చు.
కాఫీలో మార్పు
రోజూ తాగే కాఫీలో చిన్న మార్పులు చేయండి. కాఫీలో పాలకు బదులుగా నీళ్లని వాడండి, చెక్కరని కొంచెం తగ్గించండి. ఈ కాఫీ తాగడం వల్ల కొవ్వు పదార్ధాలను కాఫీతో సేవించలేరు. కాఫీలో కెఫిన్ కారణంగా కొంత ఆకలి తగ్గుతుంది, రోజంగా యాక్టివ్ గా ఉంటారు.
ఆకుకూరలు
ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోండి. ఆకుకూరల్లో కొవ్వు పదార్ధాలు అస్సలు ఉండవు. దీంట్లో ఐరన్, ఫైబర్, విటమిన్స్, కాల్షియమ్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆకుకూరలు తినడం వల్ల ఎక్కువ ఆకలి కూడా వేయదు. క్యాన్సర్ లాంటి జబ్బుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.
చక్కెరను తగ్గించాలి
స్వీట్లు తినడం తగ్గించాలి. పాలల్లో, టీలో లేదా కాఫీలో చక్కెరను తగ్గిస్తే మంచిది. చక్కెరలో బరువును పెంచే పదార్ధాలు ఉంటాయి. క్రమంగా చక్కెరను తగ్గిస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మధుమేహం బారిన కూడా పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
బరువు తగ్గడానికి మరికొన్ని చిట్కాలు
- ప్రతీ రోజు పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఆ రోజు పాజిటివ్ గా ఎలా గడపాలనుకుంటున్నారో ఆవిధంగా రాసుకొని గడపండి.
- ప్రతీ రోజూ వ్యయామం చేయండి. వ్యాయామం కొవ్వును కరిగించడమే కాకుండా ఎండార్ఫిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. దీని వల్ల మన ఒత్తిడి దూరం అవుతుంది.
- మీ డైలీ లైఫ్ ని టైమ్ టేబుల్ ప్రకారం డిజైన్ చేసుకుంటే సులువుగా బరువు తగ్గవచ్చు. ఆ టైమ్ టేబుల్ ప్రకారం మీరు మీ ఆహారంపై కంట్రల్ లో ఉంటారు కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి.
ఇవి కూడా చూడండి
- Dolo 650 Tablet Uses: డోలో 650 ట్యాబ్లెట్లను ఎలా వాడాలి?…
- Salmon Fish Benefits: సాల్మన్ ఫిష్ ఆరోగ్య ప్రయోజనాలు
- Tuna Fish Benefits: ట్యూనా ఫిష్ తింటే కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు
- Home Remedies For Diabetes: మదుమేహం, షుగర్, డయాబెటిస్ తగ్గడానికి చిట్కాలు